Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
టైర్లు వేడెక్కి లారీలో మంటలు
By Eenadu1 min read at Eenadu
In brief
A lorry traveling from Andhra Pradesh to Delhi caught fire due to overheating tyres near Katnappalli on the outskirts of Sultanabad in Peddapalli district.
Two occupants escaped unhurt.
Local fire personnel controlled the flames, and traffic on the Rajiv highway was briefly disrupted before being cleared by the Sultanabad SI.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సుల్తానాబాద్ గ్రామీణం: పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. టైర్లు వేడెక్కి మంటలు వచ్చి లారీకి అంటుకున్నాయి. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. ఏపీ నుంచి చేపల లోడుతో దిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు టైర్లు అగ్నికి ఆహుతై మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి. లారీలో ఉన్న ఇద్దరు వెంటనే కిందికి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది. సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)