Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TAJ - Tokyo - Dussehra: TAJ ఆధ్వర్యంలో టోక్యో ఓజిమాలో ఘనంగా దసరా వేడుకలు
By Eenadu1 min read at Eenadu
In brief
The Telugu Association of Japan (TAJ) organized a grand Dussehra celebration in the Oizumi area of Tokyo on Saturday evening.
The event brought together Telugu families, children, and community members in Japan to celebrate Indian traditions.
Organizers stated that these gatherings help strengthen cultural bonds and social unity among the Telugu diaspora.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (TAJ) ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. టోక్యోలోని ఓజిమా 6- చోమ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ వేడుకల్లో జపాన్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, చిన్నారులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. భారతీయ పండుగల విశిష్టత, ఆధ్యాత్మికత, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు.
‘ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే’ అనే భావనతో జపాన్లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, పండుగల ప్రాముఖ్యతను పరిచయం చేస్తూ, భావితరాలకు మన సంప్రదాయాలను అందించేందుకు కృషి చేస్తున్నాయి. విదేశీ గడ్డపై భారతీయ పండుగలను ఐకమత్యంతో చేసుకోవడం ద్వారా తెలుగు సమాజంలో సాంస్కృతిక అనుబంధాలు, స్నేహభావం, సామాజిక ఐక్యత మరింత బలపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. జపాన్లో తెలుగు భాష, సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తూ, సమాజంలోని కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో TAJ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)