Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TANA: తానా మిడ్ అట్లాంటిక్ హాఫ్ సెంచరీ ఈవెంట్ విజయవంతం
By Eenadu2 min read at Eenadu
In brief
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో 50వ కార్యక్రమం ‘లేడీస్ నైట్’ ఇటీవల ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించినందుకు తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మహిళా విభాగం కోఆర్డినేటర్ దీప్తి కోకా తదితరులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు, నిర్వాహకులకు, మరియు పురుషుల బృందానికి తానా నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం హాఫ్ సెంచరి చేసి అందరి మన్ననలను అందుకుంది. తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో వరుసగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా 50వ కార్యక్రమం ‘లేడీస్ నైట్’ ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక తానా మిడ్ అట్లాంటిక్ చరిత్రలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేలా సాగింది. జులై 2025 నుంచి ఇప్పటి వరకూ ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. 50వ కార్యక్రమాన్ని కూడా అంతే గొప్పగా ఏర్పాటు చేసింది. ఇంత తక్కువ సమయంలో 50 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమని పలువురు ప్రశంసించారు.
తానా మిడ్-అట్లాంటిక్ 50వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి అభినందించారు. తానా రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, మహిళా విభాగం కోఆర్డినేటర్ దీప్తి కోకాతో పాటు మహిళా బృందానికి రవి పొట్లూరి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. లేడీస్ నైట్ జామింగ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడంలో వారు చూపిన నాయకత్వం, అంకితభావం, సమష్టి కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)