Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తస్మై శ్రీ గురవే నమః
By Eenadu||2 min read at Eenadu
In brief
The article is a tribute to the traditional Indian guru-shishya (teacher-student) system, highlighting the spiritual and moral authority of teachers.
It recounts historical examples of revered teachers like Drona and Shukracharya, and modern instances of students showing deep respect to their teachers, such as honoring Dr.
Sarvepalli Radhakrishnan and Gurram Maheshwar Reddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘గురువు’ అనేది చాలా బరువైన పదం. గురుకుల సంప్రదాయంలో శిష్యులకు తిండి బట్ట ఇచ్చి, విద్యను గురువు ‘’ చేస్తాడు. ‘కులపతి’ అంటారాయనను. చదువును కొనుగోలు చేయడం కుదరదక్కడ- నిరంతర శుశ్రూష(సేవ)తో నేర్చుకోవాల్సిందే! సాందీపని మునివద్ద బలరామకృష్ణులు, ద్రోణుడి దగ్గర కురుపాండవులు, చండామార్కుడి చెంత ప్రహ్లాదుడు, వశిష్ఠ విశ్వామిత్రులను ఆశ్రయించి రామలక్ష్మణులు- గురుకుల సంప్రదాయంలోనే చదువుకున్నారు. నీతి తప్పితే విద్యార్థి దగ్గర లఘువైపోతానని గుర్తించినవాడే- అసలైన గురువు. రాగ ద్వేషాలకు అతీతమైనవారే- ‘ఆచార్య’ పదానికి అర్హులు. ‘ఆచార్యుడు నాకు అన్యుడుకాడు... న మర్త్యః మానవమాత్రుడూ కాడు’ అన్నాడు గీతాచార్యుడు. అదీ…
గురువు స్వభావం ఎలా ఉంటుందంటే- ‘నేను జగజ్జేతను గురువర్యా! గురుదక్షిణగా మీరు ఏం కోరినా సమర్పిస్తాను’ అని అలెగ్జాండర్ అంటే- ‘నాకు కావాల్సింది నీ దగ్గర లేదు’ అన్నాడు దండామిస్. మహాచక్రవర్తి ఇవ్వగల అపార సిరిసంపదలతో తనకేం పనిలేదని అర్థం. ఎందరో గురువులు తారసపడతారు జీవితంలో! కొందరే గుర్తుంటారు- వారి కారణంగానే మన జీవిత గమ్యం స్పష్టంగా తెలిసింది కనుక! వారి కారణంగానే మన వ్యక్తిత్వం జాగృతం అయింది కనుక! అలాంటివారే సద్గురువులు! వారిని ‘ఏడుగడ (సప్త ప్రాకారాల రక్షణ వలయం)’తో పోల్చాడు- శ్రీరామ స్తవరాజంలో మల్లనామాత్యుడు. నరేంద్రుణ్ని వివేకానందుడిగా తీర్చి ఈ జాతి వెన్నెముక నిటారుగా నిలబడేందుకు కారణమయ్యారు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)