Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
టీబీ చికిత్స పూర్తయినా, పరీక్షల్లో వ్యాధి నయమైనట్లు తేలినా, కొందరిలో దగ్గు, ఆయాసం, ఛాతీలో బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు కొనసాగుతాయని ఈ వ్యాసం వివరిస్తుంది.
టీబీ ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల్లో వాపు, కణజాల నష్టానికి కారణమై, మచ్చలు ఏర్పడి శాశ్వత మార్పులకు దారితీస్తుందని నిపుణులు తెలిపారు.
టీబీ తర్వాత కోలుకునే ప్రక్రియలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని, వైద్యుల పర్యవేక్షణలో శ్వాస వ్యాయామాలు, తగిన శారీరక శిక్షణ తీసుకోవాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
TB | క్షయవ్యాధి (టీబీ) చికిత్స పూర్తయి పరీక్షల్లో వ్యాధి నయమైనట్లు తేలినా కొందరిలో దగ్గు, ఆయాసం, ఛాతీలో బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు లేదా కొద్దిదూరం నడిచినప్పుడే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించడం చికిత్స విఫలమైందని అర్థం కాదు. టీబీ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో వాపు, కణజాల నష్టానికి కారణమవుతుంది. వ్యాధితో పోరాడి కోలుకునే సమయంలో దెబ్బతిన్న కణజాలం తిరిగి బాగుపడినా, కొన్ని సందర్భాల్లో అక్కడ మచ్చలు ఏర్పడి శాశ్వత మార్పులకు దారితీస్తాయి. అందువల్ల ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే ఊపిరితిత్తులు గతంలో మాదిరిగా పనిచేయవు.
టీబీ తర్వాత ఊపిరితిత్తుల్లో ఏర్పడే మచ్చలను వైద్య పరిభాషలో పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు. దీనివల్ల ఊపిరితిత్తుల సహజమైన సాగేగుణం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవి ప్రతి శ్వాసతో విస్తరించి, తిరిగి ముడుచుకుంటాయి. కానీ మచ్చలు ఏర్పడిన ప్రాంతాలు గట్టిపడడంతో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. మరికొందరిలో బ్రాంకియెక్టాసిస్ అనే సమస్య వస్తుంది. ఇందులో ఊపిరితిత్తుల్లోని పెద్ద శ్వాసనాళాలు శాశ్వతంగా వెడల్పుగా, మందంగా మారి దెబ్బతింటాయి. ఫలితంగా శ్లేష్మం నాళాల్లో పేరుకుపోయి దీర్ఘకాలిక దగ్గు, కఫం, పదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)