Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
టీడీఆర్ పోర్టల్ లో ఆధార్ అథెంటికేషన్ కు గ్రీన్ సిగ్నల్... జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The state government issued a government order to introduce Aadhaar authentication on the TDR portal to prevent fraud and increase transparency.
The authentication can be done via Yes/No or e-KYC, but the government clarified that it is entirely voluntary, and alternative ID proofs must be accepted for those who refuse or fail authentication.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ నగదు బదిలీ సౌకర్యం ఉన్న అభివృద్ధి హక్కుల (టీడీఆర్) పోర్టల్‌లో నకిలీలు, మోసపూరిత లావాదేవీలను అరికట్టడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్‌లో ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రవేశపెడుతూ ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)ల అనుమతుల మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కొత్త విధానం ప్రకారం ఆన్లైన్ పోర్టల్‌లో ‘యెస్/నో’లేదా ఈ-కేవైసీ పద్ధతి ద్వారా వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరిస్తారు. టీడీఆర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, లాగిన్, దరఖాస్తుల సమర్పణ, ఆస్తి డేటాబేస్‌తో లింక్ చేయడానికి ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లు ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పరిపాలనాపరమైన లాగిన్లకు కూడా ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)