Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తీవ్ర తుపానుగా బలపడిన ‘మురసు’.. గంటకు 20 కి.మీ వేగంతో తీరం వైపు
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports that Cyclone Murasu has intensified into a severe cyclonic storm in the Bay of Bengal and is moving towards the Andhra Pradesh coast at a speed of 20 kmph.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘మురసు’.. తీవ్ర తుపానుగా (Cyclone Murasu) బలపడింది. గత 6 గంటల్లో గంటకు 20 కి.మీ వేగంతో కదిలినట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి 260 కి.మీ, నెల్లూరుకు 290 కి.మీ, మచిలీపట్నానికి 320 కి.మీ, కావలికి 310 కి.మీ, ఒంగోలుకు 330 కి.మీ, విశాఖపట్టణానికి 470 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశముందని తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ వేగంతో గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే వీలుందన్నారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు.. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)