Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
తెలంగాణ మహిళలకు దీపావళి కానుక.. నవంబర్ నుంచే మిల్లెట్ కేఫ్‌లు ప్రారంభం - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The Telangana government approved the establishment of five millet cafes run by women's self-help groups, starting on November 19.
The project, funded with ₹11 crore, aims to provide self-employment to women and promote the consumption of millets, with three cafes in Hyderabad and one each in Yadadri and Mahabubnagar districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు కేఫ్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కేఫ్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.11 కోట్లు ఖర్చు చేయనుండగా, ఒక్కో కేఫ్‌కు రూ.2.2 కోట్ల చొప్పున కేటాయించనున్నారు.
నవంబర్ 19న ప్రారంభించేందుకు సన్నాహాలుమహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అద్దె ఆర్టీసీ బస్సులు, డెయిరీ ఫామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో మిల్లెట్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నవంబర్ 19న ఈ కేఫ్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతలో హైదరాబాద్‌లో మూడు, యాదాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 40 మంది మహిళలకు అవసరమైన శిక్షణ కూడా అందించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేయనున్నారు.…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)