Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తెలంగాణ నీటిని అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Former minister and BRS leader Srinivas Goud alleged that the Karnataka government is illegally diverting the Tungabhadra water allocated to Telangana.
He demanded that the state government immediately respond to protect farmers' interests and requested the Tungabhadra Board and the state irrigation department to investigate the issue.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేటాయించిన తుంగభద్ర జలాలను కర్ణాటక ప్రభుత్వం తరలించుకుపోతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తాగునీటి పేరుతో మన వాటా నీటిని కర్ణాటక మళ్లిస్తున్నదని, దీనిపై రేవంత్‌రెడ్డి ప్రభు త్వం తక్షణమే స్పందించి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాం డ్ చేశారు. బోర్డు షెడ్యూల్ ప్రకారం.. నీటిని విడుదల చేసినా, పది రోజులు గడిచినా రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు నీరు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేశారు.
గతంలో 1,500 క్యూసెకులు విడుదల చేస్తే మూడు రోజుల్లోనే ఆర్డీఎస్కు చేరేవని, ఇప్పుడు వారం దాటినా రాకపోవడం ఆందోళనకరమని వాపోయారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కర్ణాటక తమ ఎగువ ప్రాంతాల్లోనే మళ్లిస్తున్నదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తుంగభద్ర బోర్డు, రాష్ట్ర నీటిపారుదల శాఖ వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రతిరోజూ విడుదలవుతున్న నీటి పరిమాణం, వినియోగం, ఆర్డీఎస్కు వాస్తవంగా చేరుతున్న నీటి లెకలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపి, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)