Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర భారీగా తగ్గింపు
By Eenadu2 min read at Eenadu
In brief
The Telangana state government announced a significant reduction in the prices of Metro-RTC monthly and daily combined travel passes ahead of Diwali.
Minister Ponnam Prabhakar stated that the monthly pass price was cut from Rs. 8,500 to Rs. 4,000 and the daily pass from Rs.
400 to Rs. 275. The price reductions are effective from November 8, according to the state transport department.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి ప్రకటించింది. మెట్రో-ఆర్టీసీ (Rtc-Metro Monthly Pass) ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గించారు. సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆదేశాలతో రూ.8500 ఉన్న నెలవారీ పాస్ ధర రూ.4000కు తగ్గించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించి, ప్రజా రవాణా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
‘‘ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించాం. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించాం. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులకు అనుమతి ఉంటుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)