Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
తెలంగాణ ఉద్యమంలో పీటీ స్వామిది కీలకపాత్ర
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS Legislative Assembly Party Deputy Leader Harish Rao attended a memorial meeting for PT Swamy in Godavarikhani, praising his role in the Telangana movement.
Former Minister Koppula Eshwar also attended and expressed grief over Swamy's sudden passing.
Both speakers honored Swamy's legacy and promised support for his ashram.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గోదావరిఖని/ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 1: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటులో పీటీ స్వామి చేసిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ రామగుండం నియోజకవర్గ, టీబీజీకేఎస్ సంయుక్త ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పీటీ స్వామి సంస్మరణ సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే పార్టీలో చేరిన ఆయన, 26 ఏండ్లుగా పార్టీకి విశేష సేవలందించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత గౌరవించే వ్యక్తి పీటీ స్వామి అని పేర్కొన్నారు.…
వృద్ధాశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పీటీ స్వామి గుర్తుగా గోదావరిఖని ప్రాంతంలో కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని వివరించారు. ఆయన పెద్దకుమారుడు పీఎస్ అమరేందర్ నివాసానికి వెళ్లి పీటీ స్వామి చిత్రపటం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీటీ స్వామి అకాల మరణం బాధాకరమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసి, పార్టీకి గొప్ప సేవలందించారని చెప్పారు. తనకు చదువు చెప్పిన గురువే కాక, తండ్రితో సమానమైన ఆయన చివరి చూపునకు అనివార్య కారణాలతో హాజరుకాలేకపోవడం తీరనిలోటని ఆవేదన వ్యక్తంచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)