Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
తెలంగాణలో రక్తం పారిన రహదారులు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Seven people died in multiple road accidents across Telangana on Sunday and Monday. The accidents occurred in various locations including Shamshabad, Chevella, Sangareddy, and Tandur, involving bikes and a tractor.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
శామీర్‌పేట్/ చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు . జార్ఖండ్ కు చెందిన సుమిత్ కుల్లు (22), ఇతడి స్నేహితుడు కాస్మోస్ మార్కి (22) ఆదివారం తమ కంపెనీలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ముగిశాక బైక్‌పై బయటకు వెళ్లగా అలియాబాద్ బృంద కన్వెన్షన్ హాల్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నాంచేరి గ్రామానికి చెందిన రైతు అలూరి కిష్టయ్య(42) బైక్‌పై ఆలూరుకు వెళ్తుండగా.. మరో బైక్ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కిష్టయ్య మృతిచెందగా.. మరొక వ్యక్తి మహిపాల్‌కు గాయాలయ్యాయి. అలాగే, శంకర్పల్లి మండలం సింగాపురానికి చెందిన బండారి మొగులయ్య (48) ఆదివారం రాత్రి బైక్‌పై సంగారెడ్డి వైపు వెళ్తున్నాడు. కంది బైపాస్‌లోని ల్యాంకో సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉన్న చోట బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతని తలపై నుంచి వెళ్లడంతో…