Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Telangana News: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరవు మండలాలను ప్రకటించిన తెలంగాణ ప్రభత్వం
By Eenadu1 min read at Eenadu
In brief
The Telangana government declared 365 mandals across 31 districts as drought-affected due to the El Niño effect.
The cabinet sub-committee approved the recommendations based on rainfall deficits and groundwater levels from June to September.
Additionally, the Hydraa authority cracked down on illegal water trade in Kuthbullapur.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 365 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 111 మండలాల్లో తీవ్రంగా.. మరో 254 మండలాల్లో మోస్తరుగా ప్రభావం ఉందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలపై ఈనెల 23న మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది.
జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు వర్షపాతం, ప్రతి మండలంలోని 10శాతం గ్రామాల్లో భూగర్భ జలాలు, పంటల పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఎల్‌నినో పరిస్థితులు, బంగాళాఖాతంలో అల్పపీడనాలు బలహీనపడటం, సుదీర్ఘ కాలం పొడి వాతావరణం.. నైరుతి రుతుపవనాల సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 740.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా.. 17 శాతం లోటుతో 615.5 మిల్లీ మీటర్ల వర్షమే కురిసిందని వెల్లడించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం.. కరవు మండలాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)