Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
TG Govt: తెలంగాణలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌ల బదిలీ
By Eenadu1 min read at Eenadu
In brief
The Telangana state government has transferred 12 senior IAS officers to new roles, including Jayesh Ranjan as Principal Secretary of the Forest Department and Vikas Raj as Principal Secretary of the Electricity Department.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణలో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్, విద్యుత్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నవీన్‌మిత్తల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ నియమితులయ్యారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దానకిశోర్ పదవీకాలాన్ని పొడిగించారు.
గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా రాహుల్‌బొజ్జాకు, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా కె.ఇలంబర్తి, మహిళా సంక్షేమం, ఎస్సీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శ్రుతి ఓజా, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీని నియమించింది. ఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ పాటిల్‌కు టీజీ రెడ్కో వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)