Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Thane: స్నేహితుడిని మట్టుబెట్టి.. తరచూ కలలోకి వస్తున్నాడని గుట్టువిప్పి
By Eenadu1 min read at Eenadu
In brief
In Thane district, Maharashtra, a 24-year-old housekeeping worker named Prabhu Karkade allegedly murdered his friend Vishal Madhukar Kadam following a heated argument.
Karkade reportedly surrendered to the police, claiming he was haunted by nightmares of the victim, and subsequently led them to where he had dumped the body.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: తాను వ్యక్తి పదేపదే కలలోకి వస్తుండటంతో నిందితుడు హడలిపోయాడు. దీంతో పోలీసుల ఎదుట లొంగిపోయి జరిగినదంతా చెప్పేశాడు. మహారాష్ట్ర (Maharashtra)లోని ఠాణె జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డొంబీవలికి చెందిన ప్రభు కర్కడే (24) అనే యువకుడు హౌస్‌కీపింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన స్నేహితుడు విశాల్ మధుకర్ కదమ్ (43)తో అతడికి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభు విచక్షణారహితంగా దాడి చేయడంతో విశాల్ మృతి చెందాడు.
అనంతరం నిందితుడు అతడి మృతదేహాన్ని సంచిలో కుక్కి.. కోపర్ లింక్ రోడ్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. అప్పటినుంచి నిందితుడికి మృతుడు తరచూ కలలో కనిపించడం మొదలైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అతడు.. నేరుగా పోలీసులను ఆశ్రయించి జరిగినదంతా చెప్పాడు. అంతేకాకుండా తాను మృతదేహాన్ని ఎక్కడ పారవేశాడో కూడా చూపించాడు. ఇదిలా ఉండగా.. రెండు వారాల క్రితమే విశాల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)