Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
తిరువూరు అటవీ ప్రాంతాల్లోకి పెద్దపులి
By Eenadu1 min read at Eenadu
In brief
మహారాష్ట్ర నుంచి పాపికొండల అటవీ ప్రాంతాల వరకు ప్రయాణించిన పెద్దపులి ప్రస్తుతం తిరువూరు మండల అటవీ ప్రాంతాలకు చేరుకుందని అధికారులు గుర్తించారు.
శనివారం తెల్లవారుజామున జి. కొత్తూరు- చిక్కుళ్లగూడెం అటవీ ప్రాంతానికి పులి చేరినట్లు తెలిపారు. దీంతో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు, రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 8 days across 2 events →
తిరువూరు: మహారాష్ట్ర నుంచి పాపికొండల అటవీ ప్రాంతాల వరకు ప్రయాణించిన పెద్దపులి ప్రస్తుతం తిరువూరు మండల అటవీ ప్రాంతాలకు చేరుకుంది. ఎ. కొండూరు మండలం పుడమిగట్టు ప్రాంతం నుంచి సుమారు 30 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. శనివారం తెల్లవారుజామున తిరువూరు మండల పరిధిలోని జి. కొత్తూరు- చిక్కుళ్లగూడెం అటవీ ప్రాంతానికి చేరినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు అందించే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)