Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Trisha Krishnan: రాజకీయాల్లోకి త్రిష కృష్ణన్? జయలలిత తరహా బిరుదుతో కొత్త సంస్థ ఏర్పాటు!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఆమె అభిమానులు 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' అనే కొత్త సంస్థను ప్రారంభించారు.
ఈ సంస్థ సమన్వయకర్త రాజగోపాల్ మాట్లాడుతూ, త్రిష రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి పనిచేయాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు, అయితే త్రిష అధికారిక ప్రకటన చేయలేదు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు మరోసారి తమిళ రాజకీయాల్లో గా మారింది. తన నటన, అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ.. త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించబోతుందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే అనుమానాలకు తావిస్తున్నాయి. లేటెస్ట్ గా ఆమె అభిమానులు తీసుకున్న ఓ నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో త్రిష పేరు మీదుగా 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' (యువ విప్లవ నాయకురాలు త్రిష సంఘం) పేరుతో కొత్త సంస్థను ప్రారంభించారు. ఈ పేరులోని 'పురట్చి తలైవి' అనే పదం మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు అభిమానులు ఇచ్చిన బిరుదును గుర్తుచేస్తోంది. 'ఇళయ' అంటే యువ అని అర్థం. దీంతో త్రిషకు కూడా జయలలిత తరహాలో రాజకీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నమా? అనే కొత్త చర్చ మొదలైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)