Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉన్న నీళ్లకూ ఏపీ ఎసరు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది నీటి వినియోగం కోసం సాగర్ జలాశయం నుంచి అదనంగా 10 టీఎంసీలు కావాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తూ, తమకు అవసరమైన తాగునీటిని మాత్రమే వాడుకుంటామని స్పష్టం చేసింది.
దీంతో త్రీమెన్ కమిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది, పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ర్టాలు అభిప్రాయపడ్డాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : సాగర్‌లో ఉన్న నీళ్లకూ ఏపీ సర్కార్ . తొలుత 9 టీఎంసీలకు ప్రతిపాదనలకు పంపి, ఇప్పుడు అదనంగా మరో 10 టీఎంసీలు కావాలనే డిమాండ్‌ను ముందుపెట్టింది. మరోవైపు తెలంగాణ సైతం తాగునీటి కోసం 30 టీఎంసీలు అవసరమని ప్రతిపాదనలు పంపింది. నీళ్ల కోసం ఎవరికి వారు పట్టుబట్టడంతో త్రీమెన్ కమిటీ అర్ధంతరంగా ముగిసింది. పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌లోనే చర్చించి, నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ, ఇరు రాష్ర్టాలు అభిప్రాయానికి వచ్చాయి. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ నేతృత్వంలో తెలంగాణ ఈఎన్సీ రమేశ్‌బాబు, ఏపీ ఈఎన్సీ నర్సింహమూర్తి…
రాబోయే మూడు నెలల కాలానికి తొమ్మిది టీఎంసీలు కావాలని ప్రతిపాదనలు పెట్టిన ఏపీ తాజా భేటీలో మరో డిమాండ్ ముందుకు తెచ్చింది. ఆ 9టీఎంసీలతోపాటు అదనంగా కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఆర్ఎస్)కు 10టీఎంసీలు కావాలని డిమాండ్ చేసింది. అదీగాక సాగర్ డెడ్ స్టోరేజీ 510 ఫీట్లు కాగా, అంతకు దిగువన 490 ఫీట్ల వరకు అందుబాటులో ఉండే 31 టీఎంసీలను సైతం వినియోగించుకుందామని ప్రతిపాదించింది. అయితే ఏపీ ప్రతిపాదనలను తెలంగాణ సర్కార్ తిరస్కరించింది. ప్రస్తుతం సాగర్‌లో డెడ్‌స్టోరేజ్‌కు ఎగువన 45 టీఎంసీలు ఉన్నాయని, అందులో 5 టీఎంసీలు ఆవిరి నష్టాలు పోతే నికరంగా 40 టీఎంసీలే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)