Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఉత్తమ్‌కుమార్‌వి పొంతనలేని మాటలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి కృష్ణా నదీజలాల విషయంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పొంతనలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల నుంచి అక్రమంగా నీటిని తరలిస్తోందని, నాగార్జున సాగర్ డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు సొరంగం నిర్మిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై జిల్లా మంత్రులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేకుండా చెరోమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
నేరేడుచర్ల, నవంబర్ 19: కృష్ణా నదీజలాల విషయంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పొంతనలేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి లెక్కలకు, మంత్రి చెప్తున్న లెక్కలకు పొంతన ఉండటం లేదని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
నాగార్జున సాగర్ డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ జల్‌జీవన్ మిషన్ పథకం కింద చేపడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై జిల్లా మంత్రులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేకుండా చెరోమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయం తమకు ముందే తెలుసని మంత్రులు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ముందే తెలిసి ఉంటే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం ఎందుకు తీసుకోలేదని, ఎందుకు అభ్యంతరాలు వ్యక్తంచేయలేదని ప్రశ్నించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)