Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వాహన్ పోర్టల్.. సేవల్లో ట్రబుల్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తెలంగాణలో కొత్తగా వచ్చిన కేంద్ర పోర్టల్ ‘వాహన్’పై డీలర్లకు సరైన అవగాహన మరియు శిక్షణ లేకపోవడంతో సేవల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని నివేదిక పేర్కొంది.
పాత డేటాబేస్ నుంచి కొత్త పోర్టల్‌కు సమాచార మార్పిడి సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, నంబర్ ప్లేట్ల బిగింపులో జాప్యం వల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది.
క్షేత్రస్థాయిలో సమస్యలు తప్పడం లేదని డీలర్లు విమర్శిస్తుండగా, రవాణా శాఖ అధికారులు డీలర్లకు హెచ్చరికలు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కొత్తగా వచ్చిన కేంద్ర పోర్టల్ ‘వాహన్’పై డీలర్లకు అవగాహన ఉండటం లేదు. సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో సకాలంలో అందాల్సిన సేవల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. పాత డేటాబేస్ నుంచి కొత్త పోర్టల్‌కు సమాచార మార్పిడి సమయంలో సాంకేతిక సమస్యలు తొలుత తలెత్తాయి. కొన్ని దరఖాస్తుల ప్రాసెస్కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వాహన్పై అందరికీ అవగాహన కల్పించి, శిక్షణ అందించామని రవాణా శాఖ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు తప్పడం లేదు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల నుంచి నంబర్ ప్లేట్ల బిగింపు వరకు అంతరాయం ఏర్పడుతుంది.
తమపై అదనపు భారం మోపి రవాణా శాఖ అధికారులు చలాయించడంపై కొందరు డీలర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పోర్టల్‌ను ఎలా వినియోగించాలి? దరఖాస్తులను ఎలా అప్లోడ్ చేయాలి? లోపాలను ఎలా సరిచేయాలి? అనే అంశాలపై డీలర్ల సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొందరు అధికారులకు సైతం వాహన్ పోర్టల్ వినియోగంపై స్పష్టత లేకపోవడం గమనార్హం. అయితే తెలంగాణలో వాహన్ పోర్టల్ సేవలను దశలవారీగా ప్రారంభించారు. అన్ని సేవలను ఒకేసారి అందుబాటులోకి తీసుకురాకుండా విడతలవారీగా ప్రారంభించడంతో పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు, ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులోను సమస్యలు తలెత్తాయి. అయితే ఇప్పటికీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)