Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వామ్మో.. వడలో ఇనుప బోల్టు.. వందే భారత్ రైలులో ప్రయాణికుడికి తప్పిన ప్రమాదం.. IRCTC క్షమాపణ !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
సమర్థ్ కొడియాల్ అనే ప్రయాణికుడు బెంగళూరు నుంచి బెల్గాం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్లో తనకు అల్పాహారంగా ఇచ్చిన వడలో ఒక ఇనుప బోల్టు కనిపించిందని ఫిర్యాదు చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో IRCTC స్పందించి ప్రయాణికుడికి క్షమాపణ చెప్పింది మరియు సంబంధిత ఆహార సరఫరా సంస్థపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా వంటగది సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేసినట్లు వెల్లడించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణిస్తే మంచి సౌకర్యాలతో పాటు నాణ్యమైన ఆహారం కూడా లభిస్తుందని ప్రయాణికులు ఆశిస్తారు. కానీ ఓ ప్రయాణికుడికి మాత్రం వందే భారత్ రైలులో చేదు అనుభవం ఎదురైంది. అల్పాహారంగా ఇచ్చిన వడలో ఏకంగా ఒక ఇనుప బోల్టు కనిపించింది. వడ తింటున్న సమయంలో ఆ బోల్టు అతడి పళ్ల మధ్య ఇరుక్కోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే దానికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ, ఐఆర్సీటీసీ స్పందించాయి.
వడలో ఇనుప బోల్టు సమర్థ్ కొడియాల్ అనే ప్రయాణికుడు బెంగళూరు నుంచి బెల్గాం వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో రైలులో అతడికి అల్పాహారంగా వడ ఇచ్చారు. అయితే వడ తింటుండగా అతడి పళ్ల మధ్య ఒక్కసారిగా ఏదో గట్టిగా తగిలింది. మొదట ఏంటో అర్థం కాలేదు. దీంతో వడను పరిశీలించగా అందులో ఒక పెద్ద ఇనుప బోల్టు కనిపించింది. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. ప్రయాణికులకు ఇచ్చే ఆహారంలో ఇలాంటివి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే ఆ బోల్టు, వడకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)