Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
వైఎస్‌లా నేనూ పదేండ్లు ఉంటా!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు, తాను కూడా పదేండ్లు సీఎంగా ఉంటానని పేర్కొన్నారు.
తమ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని, కోటిమంది మహిళలకు చీరలు ఇస్తున్నందున తమకే ఓట్లు పడతాయని ఆయన అన్నారు.
సభకు హాజరైన జనసందడి తక్కువగా ఉండటంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి, అలాగే స్టేజీపై ప్రతిపక్ష నేతల ఫొటోలు పెట్టడంపై ప్రజలు సెటైర్లు వేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహబూబ్‌నగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, తాను కూడా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి అచ్చంపేట సభలో మళ్లీ పారించారు. ఎన్టీయార్, వైఎస్, కేసీఆర్‌లు పదేండ్లు పాలించారని, ఆ లెక్కన తాను 2034 వరకు అధికారంలో ఉంటానని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి 2004 నుంచి 2009 వరకు ఐదేండ్ల మూడునెలలు మాత్రమే పాలించారు. కానీ ఆయన పదేండ్లు పాలించారంటూ రేవంత్ మాట్లాడుతుంటే ప్రజలవంతైంది.
గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తమ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని, రైతు బీమా, రైతు భరోసా, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు.. 24 గంటల ఉచిత కరెంట్, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ధైర్యంగా పంటలు పండించే స్థాయికి రైతులు ఎదిగారని పేర్కొన్నారు. కోటిమంది ఆడబిడ్డలకు చీరలిస్తున్నందున, వారి ఓట్లు తమకే పడుతాయని.. చీర తీసుకుని మహిళలు 90 సీట్లల్లో తమను గెలిపిస్తారని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)