Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Union Railway Minister Ashwini Vaishnaw flagged off the Bengaluru-Mumbai Vande Bharat Sleeper train on Sunday.
The train departed from Bengaluru's SMVT station and is scheduled to arrive at Mumbai's CSMT on Monday morning.
The route includes several stops across Andhra Pradesh, Karnataka, and Maharashtra.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం జెండా ఊపి దీనిని ప్రారంభించారు. 16 కోచ్‌లు ఉన్న ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) నుంచి బయలుదేరింది. (Vande Bharat Sleeper Train) సోమవారం ఉదయం 6.15 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌కు ఇది చేరుకుంటుంది. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రులు వి. సోమన్న, శోభా కరంద్లాజె, పార్లమెంటు సభ్యులు తేజస్వి సూర్య, పి.సి. మోహన్, సి.ఎన్. మంజునాథ్ సహా పలువురు ప్రముఖులు ఈ రైలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, బెంగళూరు నుంచి ముంబైకి రాత్రి వేళ నడిచే, ప్రయాణికులకు నిద్రించే సౌకర్యం ఉన్న వందే భారత్ స్లీపర్ రైలు నంబర్ 27652 సోమవారాలు తప్ప వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. నవంబర్ 2 నుంచి రెగ్యులర్‌గా ఎస్ఎమ్వీటీ బెంగళూరు స్టేషన్ నుంచి రాత్రి 7:45 గంటలకు బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 11:55 గంటలకు సీఎస్ఎమ్టి ముంబైకి చేరుతుంది. ఈ రైలు అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురగి, షోలాపూర్, పూణె, కళ్యాణ్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)