Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
VC Sajjanar: వినోదమా.. విషాదమా? ఇలాంటి నిర్లక్ష్యంతో మీ ప్రాణాలకే ముప్పు: సజ్జనర్ పోస్టు
By Eenadu2 min read at Eenadu
In brief
Hyderabad City Police Commissioner VC Sajjanar posted a message on social media regarding a recent accident where a person wearing earphones was hit by a train near Bollaram.
He urged the public to stop using earphones while walking on railway tracks or driving on roads.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఇయర్‌ఫోన్ పెట్టుకొని నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వీడియోను షేర్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ (VC Sajjanar) ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా, ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా? ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
‘‘ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్ ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా? లేదంటే కళ్లముందే పొంచి ఉన్న మృత్యు కేకను కూడా వినిపించకుండా ప్రాణాల్ని కబళించే మాయా తెరగా మారుతున్నాయా? రైల్వే ట్రాక్ పక్కన బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు క్షణాల వ్యవధిలో ఢీకొట్టిన ఈ హృదయ విదారక దృశ్యం ఎవరి గుండెలనైనా బరువెక్కించక మానదు. హైదరాబాద్ బొల్లారం సమీపంలో ఇటీవల జరిగిందీ ప్రమాదం. క్షణకాలం ఏమరుపాటు, మితిమీరిన అజాగ్రత్త ఎంత ముప్పు తెస్తుందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. భీకరమైన శబ్దంతో రైలు దూసుకొస్తున్నా, హారన్ మోగుతున్నా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)

