Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వేడివేడి టీ తాగకండి.. అలా అని చల్లబడిపోయాక తాగమని కాదు.. టీ 65°C కంటే వేడిగా ఉంటే..
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- A study published in the 'International Journal of Cancer' involving approximately 10 lakh participants found that regularly consuming tea or coffee at temperatures above 65°C significantly increases the risk of esophageal cancer. The research indicates that drinking six or more cups of hot beverages daily raises this risk by 71%. Medical experts warn that the high temperatures can damage the epithelial lining of the mouth, throat, and food pipe over time.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
మన దేశంలో ఛాయ్ అదేనండీ టీ తాగడం అనేది నూటికి 90 శాతం మంది జీవితంలో దైనందిన చర్య. ఉదయాన్నే టీ, కాఫీలు తాగడం వల్ల నూతనోత్తేజం, ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంటామనేది చాలా మంది భావన. కొందరు వేడి వేడి టీని అలానే తాగేస్తుంటారు. అలా తాగడం చాలా ప్రమాదమని, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. చాలా వేడిగా ఉండే టీ తాగే అలవాటు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. టీని 65°C కంటే వేడిగా ఉన్నప్పుడు తాగితే క్యాన్సర్ వచ్చే ఉందని, ఇటీవల.. 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్'లో ఒక అధ్యయనం ప్రచురించారు.
ఈ అధ్యయనంలో సుమారు 10 లక్షల మంది పాల్గొన్నారు. 65°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న టీ లేదా కాఫీ తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ (ఆహార నాళానికి వచ్చే ఒక రకమైన క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. అలాగే.. ప్రతిరోజూ ఆరు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీ లేదా కాఫీ తాగేవారికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 71 శాతం ఎక్కువగా ఉందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది.