Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వెలుగు స్పెషల్ : విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతోంది?
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
ఈ వ్యాసం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలు, వారి ధర్నాలు, మరియు పాలకవర్గాల వైఖరి గురించి చర్చిస్తుంది.
గతంలో ఉపకులపతులకు విద్యార్థి సంఘాల్లో అనుభవం ఉండేదని, కానీ ప్రస్తుత అధికారులకు ఆ అనుభవం లేక గందరగోళ పరిస్థితులు నెలకొల్పుతున్నారని రచయిత పేర్కొన్నారు.
నిజాం కళాశాల, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల్లో వసతి, హాల్ టికెట్లు, ఫీజుల దోపిడీ వంటి సమస్యలపై విద్యార్థులు గళమెత్తారని ఈ వ్యాసం తెలియజేస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మన దేశంలో పూర్వ రోజుల నుంచే విశ్వవిద్యాలయాల్లో జరిగే చర్చలకు, పరిశోధనలకు గొప్ప ప్రాధాన్యం ఉండేది. ప్రాచీన కాలంలోనే నలంద, తక్షశిలలాంటి విశ్వవిద్యాలయాలుండేవి. ఎన్నో విశ్వవిద్యాలయాలు లక్షలాది మంది మేధావులను, రాజకీయ నాయకులను, శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను, బ్యూరోక్రాట్లను, సామాజిక కార్యకర్తలను ప్రపంచానికి అందించాయి. సమాజ నిర్మాణంలో వారు తమదైన పాత్రను పోషించారు. మన రాష్ట్రంలో సైతం ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాలకు సైతం వాటికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా మన విశ్వవిద్యాలయాలు నిర్మాణాత్మక పాత్రను పోషించాయి.
విశ్వవిద్యాలయంలో విద్యతోపాటే సమాజానికి సంబంధించిన చర్చ సైతం జరగాలి. విశ్వవిద్యాలయాలలో వివిధ భావజాలాలు ఉంటాయి. వివిధ భావజాలాలను ముందుకు నడిపే వ్యక్తుల సమూహం ఉంటుంది. ఆయా భావజాలాలపై చర్చ సైతం జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడే విద్యార్థులు సమాజంలోని సమస్యలను అధ్యయనం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా ఎదగగలరు. అలా ఎదిగినప్పుడే విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఎదిగిన నాయకత్వం సమాజంలోని సమస్యలపై స్పందించి, ప్రశ్నించి దేశానికి, దేశ ప్రజలకు నాయకత్వం వహించగలరు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)