Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
విదేశాలకు వెళ్లే నిరుద్యోగులకు 1.75 లక్షల సబ్సిడీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ సీమ్ (సీఎంఓఈఎస్)ను ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద విదేశాలకు వెళ్లే నిరుద్యోగ యువతకు రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ అందివ్వనున్నది.
ఈ పథకాన్ని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్కామ్) ఆధ్వర్యంలో అమలు చేయనుండగా, తొలి ఏడాది 7వేల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ సీమ్ (సీఎంఓఈఎస్)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే నిరుద్యోగ యువతకు రూ.1.75లక్షల వరకు సబ్సిడీ అందివ్వనున్నది. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీచేసింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్కామ్) ఆధ్వర్యంలో పథకాన్ని అమలు చేయనుండగా, తొలి ఏడాది 7వేల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులను 2 క్యాటగిరీలుగా విభజిస్తారు. క్యాటగిరీ-1 (డైరెక్ట్ మైగ్రేషన్) కింద విదేశీ భాషా శిక్షణ, ధ్రువీకరణ అవసరం ఉన్న ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు అర్హత కలిగిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందులో గరిష్ఠంగా 50 శాతం అంటే రూ.50 వేలకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది. ఇది వీసా, ప్రయాణ ఖర్చులకు మాత్రమే వర్తిస్తుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)