Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
విజయవాడలో నవరాత్రి వైభవం... ఆధునిక హంగులతో రాగా దాండియా ఉత్సవ్ 2.0..
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- The article describes the successful organization of 'Raga Dandiya Utsav 2.0' in Vijayawada, a cultural event hosted by Vega Jewellers that featured traditional and contemporary dance performances. The event was attended by Deputy Speaker Raghurama Krishnam Raju and was praised by attendees for bringing peace and joy during the Navaratri festival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
విజయవాడలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తిశ్రద్దలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలతో కోలాహలంగా మారిపోయింది. ఆదివారం ( అక్టోబర్ 18 ) వేగా జ్యువెలర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ విజయవాడ కళాత్మక హృదయాన్ని ఆవిష్కరించింది. సాంప్రదాయ దాండియా, గర్బా నృత్యాలతో పాటు సమకాలీన కళారూపాలను మేళవించి నిర్వహించిన ఈ వేడుక నగర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా సాగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు. నిర్వాహకులతో కలిసి వేదికపై దాండియా ఆడి సందడి చేశారు.
ఈ వేడుకలో విజయవాడ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ అండ్ టీమ్ అద్భుతమైన నృత్య రూపకాలతో స్టేజ్పై అలరించారు. ఒకవైపు సాంప్రదాయ పంజాబీ ధోల్ వాయిద్యాల గంభీర నాదం, మరోవైపు డీజేల సంగీత హోరు కలిసి కన్వెన్షన్ హాల్ను ఒక సరికొత్త లోకంగా మార్చేసాయి. యువత, మహిళలు, కుటుంబ సమేతంగా తరలివచ్చి సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ పండుగ ఉత్సాహాన్ని అంబరానికి చేర్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)