Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A bus belonging to the Garhwal Motor Owners Union plunged into a gorge in Uttarakhand's Pauri district on October 21 after a technical failure caused it to stall on a sloped road.
A tree stopped the bus from falling completely, and the passengers jumped out to safety while police and rescue teams evacuated them.
Two passengers sustained minor injuries, and a video of the event went viral on social media.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
డెహ్రాడూన్: ఒక బస్సు నియంత్రణ కోల్పోయింది. లోయలోకి అది దూసుకెళ్లింది. అయితే ఒక చెట్టు అడ్డుగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు జంప్ చేసి దాని నుంచి బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bus Plunges Into Gorge) ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 21న గర్వాల్ మోటార్ ఓనర్స్ యూనియన్‌కు చెందిన బస్సు, కోట్ద్వార్ నుంచి పౌరీ-శ్రీనగర్‌కు వెళ్తున్నది. అయితే గుమ్ఖాల్, భదలిఖాల్ మధ్యలో ఆ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రెజర్ పైపు అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో బస్సు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
కాగా, రోడ్డు వెనుక వైపు వాలుగా ఉండటంతో ఆ బస్సు అదుపు తప్పింది. రోడ్డుకు ఎడమ వైపున ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఒక చెట్టును బలంగా ఢీకొట్టడంతో అది ఆగిపోయింది. ఒక నిర్మాణంపై ఒరిగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే బోల్తా పడిన ఆ బస్సు లోయలోకి ప్రమాదకరంగా వేలాడింది. అందులోని ప్రయాణికులు సాహసం చేశారు. ఆ బస్సు నుంచి దూకి బయటపడ్డారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)