Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- A Uttarakhand cabinet minister, Subodh Uniyal, publicly reprimanded Punjabi singer Daler Mehndi during a Navratri cultural event in Tehri district for allegedly singing under the influence of alcohol. The minister criticized the singer for disrespecting the religious occasion, while Mehndi was seen on stage pleading with the minister to leave the venue.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
డెహ్రాడూన్: పంజాబ్ సింగర్ దలేర్ మెహందీపై ఒక మంత్రి వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సింగర్ మద్యం సేవించి పాటలు పాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఏమాత్రం తగదంటూ ఆ గాయకుడిపై మండిపడ్డారు. (Minister Snaps At Daler Mehndi) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా కుంజాపురి జాతరలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పంజాబ్‌కు చెందిన ప్రసిద్ధ గాయకుడు దలేర్ మెహందీ తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
కాగా, ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వేదికపైకి వచ్చిన ఆయన పాడటం ఆపేయాలని దలేర్ మెహందీని కోరారు. ఆ తర్వాత పంజాబ్ సింగర్‌పై ఆయన మండిపడ్డారు. ‘నవరాత్రి సందర్భంగా దుర్గామాతకు సంబంధించిన కార్యక్రమం ఇది. మీరు మద్యం సేవించి ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఇది ఏమాత్రం తగదు’ అని అన్నారు.