Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Wedding like a Fair: ఆ పెళ్లికి లక్షలాది మంది జనం.. 10కి.మీ. ట్రాఫిక్ జామ్
By Eenadu2 min read at Eenadu
In brief
బిహార్‌లోని మోకామా ఎమ్మెల్యే అనంత్‌సింగ్ కుమార్తె శివంగి సింగ్ వివాహాన్ని పట్నా జిల్లాలోని నడ్వాన్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహానికి లక్షలాది మంది హాజరవడంతో సుమారు 10 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తుది పోటీలను అదుపు చేయలేక వాయిదా వేయడంతో పాటు, వందలాది మంది పోలీసులు, దాదాపు మూడు వేల మంది ప్రైవేటు గార్డులను అందుబాటులో ఉంచారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో వివాదాస్పద వ్యాఖ్యలతో జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన మోకామా ఎమ్మెల్యే అనంత్‌సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కుమార్తె శివంగి సింగ్ వివాహాన్ని పట్నా జిల్లాలోని నడ్వాన్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బిహార్‌తో పాటు పక్క రాష్ట్రం నుంచి లక్షలాదిగా జనం తరలిరాగా.. వారి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో సుమారు 10 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డు పక్కన అనేక దుకాణాలు, లౌడ్ స్పీకర్లతో ఆ ప్రాంతమంతా ఓ జాతరలా మారిపోయింది.
వివాహ వేడుకలో భాగంగా గుర్రపు స్వారీ, కుస్తీ పోటీలను నిర్వహించారు. బిహార్, యూపీ, ఝార్ఖండ్, రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి 50కిపైగా గుర్రాలు వచ్చాయి. కేవలం ఈ పోటీలను చూసేందుకే సుమారు లక్ష మంది వచ్చినట్లు అంచనా. ఆ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోగా.. అనేకమంది పక్కనే ఉన్న విద్యుత్ హైటెన్షన్ టవర్లను ఎక్కి తిలకించారు. పరిస్థితిని అదుపు చేయలేక తుది పోటీలు వాయిదా వేసినట్లు సమాచారం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)