Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
యూరప్‌లో వడగాల్పుల బీభత్సం - 3 నెలల్లో 50 వేల మందికి పైగా మృతి
By Prajasakti||2 min read at Prajasakti
In brief
[PUBLISHER] reported that over 50,000 people died due to heatwaves in Europe between June and August this year.
Health officials stated that approximately 32,600 of these deaths were linked to pollution and climate change.
Scientists warned that without immediate, coordinated action, extreme weather events will become more dangerous in the future.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
యూరప్ : శీతల వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఐరోపా ఖండం ప్రస్తుతం తీవ్ర ఎండలు, వడగాల్పులతో . ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే వడగాల్పుల కారణంగా యూరప్‌లో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మరణించిన వారిలో సుమారు 32,600 మంది శిలాజ ఇంధనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యంతో ముడిపడిన వాతావరణ మార్పుల ప్రభావానికి బలైనట్లు తెలిపారు. బ్రిటన్‌లోనే ఈ వేసవిలో 4,354 మంది మరణించినట్లు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్యలో వృద్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లోనూ అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)