Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
యువత ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత పార్లమెంట్లదే: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Lok Sabha Speaker Om Birla inaugurated the 12th BRICS Parliamentary Forum in Delhi and stated that Parliament has the responsibility to provide meaningful opportunities for the youth's aspirations.
He emphasized that democratic systems must adapt to changing public expectations, maintain transparency, and serve as a platform for constructive dialogue.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: యువత ఆశలు, ఆకాంక్షలకు అర్థవంతమైన అవకాశాలు కల్పించి, వారి ప్రతిభ వెల్లివిరిసేలా తగిన వాతావరణం సృష్టించాల్సిన పార్లమెంట్లపై ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. నేటి యువత మెరుగైన విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సమాజానికి ఏమైనా చేయాలనే తపనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
వారి శక్తి సామర్థ్యాలను దేశ నిర్మాణానికి అనుకూలంగా మలచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువత కేవలం వ్యక్తిగత భవిష్యత్తు కోసమే కాకుండా, దేశాల ఉమ్మడి గమ్యానికి చిహ్నమని ఓం బిర్లా అభివర్ణించారు. ప్రజలలో మారుతున్న ఆశయాలకు అనుగుణంగా పార్లమెంట్లు నిరంతరం మారుతూ ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధమైన అధికారాలే కాకుండా, ప్రజలతో మమేకమవడం, పారదర్శకతను కాపాడడం, నిర్మాణాత్మక చర్చలకు వేదికగా నిలవడంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థల అసలు బలం దాగివుందని ఆయన గుర్తుచేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)