Eenadu ·
Sonia Gandhi: సీరియల్ కిల్లర్ గర్ల్‌ఫ్రెండ్‌కు.. సోనియా ఇంటి నుంచి భోజనం..
ఇంటర్నెట్ డెస్క్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కొంతకాలం తిహాడ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె కోసం సోనియా గాంధీ (Sonia Gandhi) ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లేవారు. అలా ఓ సందర్భంలో సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు కూడా భోజనం పంపించారట. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో సోనియా (Sonia Gandhi Book) పేర్కొన్నారు.
‘‘తిహాడ్ జైల్లో ఉన్నప్పుడు అత్తమ్మ (ఇందిరా గాంధీ) తనతో పాటు మరికొంతమందికి కూడా భోజనం తీసుకురమ్మని చెప్పేవారు. అలా ముగ్గురు మహిళా గార్డులు, జైల్లో ఖైదీగా ఉన్న ఓ విదేశీ యువతికీ నేను ఓసారి భోజనం తీసుకెళ్లా. ఆ యువతి ఎవరో కాదు.. భారత్‌తో సహా థాయ్‌లాండ్, నేపాల్‌లో ఎంతోమందిని హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న ఛార్లెస్ శోభరాజ్ (Charles Sobhraj) గర్ల్‌ఫ్రెండ్. ఆ విషయం తర్వాత తెలిసింది’’ అని సోనియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. అయితే, ఆ యువతి పేరును మాత్రం కాంగ్రెస్ నాయకురాలు పేర్కొనలేదు.