We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
IREF Vice President Dev Garg stated that India's rice exports will grow due to lower domestic prices compared to competing nations, amidst rising global demand. The federation reported that rice exports were valued at Rs.
అంతర్జాతీయంగా పెరుగుతున్న గిరాకీ ఐఆర్ఈఎఫ్ ఉపాధ్యక్షుడు దేవ్ గార్గ్
దిల్లీ: అంతర్జాతీయంగా బియ్యానికి గిరాకీ పెరుగుతుండగా, పోటీ దేశాల కంటే మనదగ్గర ధర తక్కువగా ఉండటంతో.. ఇక్కడి నుంచి బియ్యం ఎగుమతులు మరింత పుంజుకుంటాయని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్ఈఎఫ్) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మనదేశం నుంచి రూ.54,937.71 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి అయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయం కంటే ఈ విలువ 13% ఎక్కువ.
The Telangana CID has intensified its investigation into alleged irregularities in the supply of fine rice, arresting 14 millers and registering three criminal cases.
The president of the Mulugu Rice Millers Association, Badam Praveen, was arrested by CID officials near Jakkaram on the national highway, which caused a stir.
హైదరాబాద్: తెలంగాణలో సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖరీఫ్ 2025–26 సీజన్లో ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్ ప్రక్రియ, ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా వ్యవహారాలపై విచారణ చేపట్టారు. సన్న బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, అందుకు బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులపై అక్రమాల ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి 3,385.820 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కారణంగా బోనస్ రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
Mulugu | ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అరెస్టు కలకలం రేపింది. ములుగు సమీపంలోని జాకారం వద్ద జాతీయ రహదారిపై సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టుకు గల కారణాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ములుగులో ఈరోజు మధ్యాహ్నం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తమకు నచ్చిన వ్యక్తినే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కొందరు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎన్నికల వ్యవహారం వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అసోసియేషన్‌కు చెందిన మాజీ కార్యవర్గ సభ్యులు ముగ్గురిని సీఐడీ అధికారులమని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది. అయితే అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అరెస్టుకు, మాజీ కార్యవర్గ సభ్యులను తీసుకెళ్లిన ఘటనకు మధ్య సంబంధం ఉందా? ఎన్నికల వివాదమే ఈ పరిణామాలకు కారణమా? అనే అంశాలపై స్పష్టత…
Sircilla | సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 23: సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం, నూతన పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఉదయం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పద్మశాలి మహిళలు అమ్మవారికి సమర్పించేందుకు ఒడిబియ్యాన్ని సిద్ధం చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారితో పాటు లక్ష్మీ, పద్మావతి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించారు.
Rice Price | సన్నబియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మొన్నటివరకు క్వింటాలు రూ.6వేల నుంచి రూ. 7 వేలకు పలికిన ధరలు ఇప్పుడు అమాంతం హైక్ అయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే 25 నుంచి 35 శాతం వరకు పెరిగి చుక్కలు చూపుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో మరో 30 శాతం పెరిగే అవకాశాలుండగా, పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం, ఇతర రాష్ట్రాల బ్రోకర్లు కల్లాల మీద నుంచే వడ్లను తన్నుకుపోతుండడం, మరోవైపు స్థానిక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిన సర్కారు, ధరలను నియంత్రించడంలో విఫలమైందనే విమర్శలు…
కరీంనగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / హుజూరాబాద్ : మన రాష్ట్రంలో పండే బీపీటీ, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ వంటి తదితర సన్నరకాల బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్నది. పొరుగు రాష్ట్రాల్లోని మెట్రో నగరాలైన ముంబై, బెంగళూర్, చెన్నై వంటి ప్రాంతాలతోపాటు విదేశాల్లోనూ మంచి ఆద రణ ఉన్నది. అయితే ఈ సారి ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థి తులు ఏర్పడడం, ఆయా రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మన ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డితోపాటు సన్నాలు పండించే జిల్లాల్లో…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.