We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
[PUBLISHER] reported that A. Praveen Reddy, president of the Mulakanuru Rural Credit Marketing Cooperative Society in Bheemadevarapalli, Hanumakonda district, is working to establish a market for Mulakanuru rice and seeds in South Korea.
భీమదేవరపల్లి(హనుమకొండ ), వెలుగు : ములకనూరు బియ్యం, విత్తనాలకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు సొసైటీ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ, దక్షిణ కొరియా మధ్య వాణిజ్య సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
అందులో భాగంగా దక్షిణ కొరియాలోని ప్రముఖ ఆహార పరిశ్రమల సముదాయం ఫుడ్పోలిస్, అంతర్జాతీయ ఆహార ప్రదర్శన కేంద్రాలను ఆయన సందర్శించారు. కొరియాలోని భారత వాణిజ్య మండలి అధ్యక్షుడు రమేశ్అయ్యర్, సియోల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారి మినిదేవి కుమంను కలిసి భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న వాణిజ్య అవకాశాలపై చర్చించారు.
The article reports on the rising prices of rice in Telangana, attributing the increase to various factors including reduced sowing area, weather impacts, and market dynamics.
The Hyderabad district civil supplies department has decided to directly supply rice to retailers from rice mills to ensure availability and fair prices.
The Telangana government has implemented measures to control rice prices following a drought caused by El Niño, setting a minimum price of Rs 66 per kg and a maximum of Rs 79 per kg.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పంజాబ్, ఏపీ వంటి రాష్ర్టాలను అధిగమించేలా ధాన్యం పండించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ తర్వాత వచ్చిన కాంగ్రెస్ హయాంలో ధాన్యం ఉత్పత్తి మాట అటుంచి, బియ్యం ధరలు భారంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సన్నబియ్యం కిలో ధర రూ.85 నుంచి రూ.90కు చేరింది. గతంలో రూ.50 నుంచి రూ.55కు లభించిన కొన్ని రకాల బియ్యం ధరలు నాలుగు నెలల్లోనే గణనీయంగా పెరిగాయి.
ధరల పెరుగుదలకు సాగు విస్తీర్ణం తగ్గడం, వాతావరణ ప్రభావం, ఇతర రాష్ర్టాల వ్యాపారుల కొనుగోళ్లు, స్థానిక సరఫరా తగ్గడం వంటి కారణాలను వ్యాపారులు, మిల్లర్లు చెప్తున్నారు. తెలంగాణ సన్నధాన్యానికి ఇతర రాష్ర్టాల్లో డిమాండ్ ఉండటం రైతుకు మెరుగైన ధర లభించే అవకాశాన్ని కల్పిస్తున్నది. అక్టోబర్ 13న వెలువడిన నివేదిక ప్రకారం.. కొన్ని రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.4,000 నుంచి రూ.4,600 వరకు ప్రైవేట్ కొనుగోలు ఆఫర్లు వచ్చాయి. అక్టోబర్ 26న మరో నివేదికలో సాధారణ సన్నధాన్యం రకాలకు రూ.3,100 నుంచి రూ.3,700 ధరలు పలికింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఒక మేలు రకం క్వింటాల్‌కు రూ.5,016 పలికింది. ఈ ధరల వ్యత్యాసం రకం…
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల, కొరత పేరుతో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే వ్యాపారులు, దళారుల ఆట కట్టించేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా ఉపేక్షించబోమని సివిల్సప్లయ్స్ శాఖ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ లాల్ వార్నింగ్ ఇచ్చారు.
మార్కెట్లో బియ్యం స్టాక్ లేదంటూ కొందరు వ్యాపారులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రిటైలర్లకు స్టాక్ సమస్యలు ఎదురైతే హోల్‌సేల్ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారిని కలిసి అవసరమైన బియ్యం వివరాలతో ఇండెంట్ ఇస్తే, రైస్ మిల్లర్ల నుంచే సరఫరా చేయించే అవకాశం ఉందని తెలిపారు. 25 కిలోల బస్తాలపై 26 కిలోలుగా పేర్కొంటూ స్టిక్కర్లు అతికించడం, అసలు ఎంఆర్పీ కనిపించకుండా దానిపై అధిక ధరలతో కూడిన నకిలీ స్టిక్కర్లు వేయడం వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మార్కెట్లో బియ్యం కొరత లేకుండా చూడటంతోపాటు సాధారణ ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని రిటైల్ వ్యాపారులందరికీ రైస్ మిల్లర్ల ద్వారా నేరుగా బియ్యం సరఫరా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. బియ్యం లభ్యత, సరఫరా విషయంలో రిటైల్ వర్తకులు ఎలాంటి ఆందోళనకూ గురికావాల్సిన అవసరం లేదని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సిఆర్ఒ) జివి శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.