We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలో ‘కోవెంట్రీ తెలుగు అసోసియేషన్’ (CoTA) ఆధ్వర్యంలో రెడ్ రోజ్ ఎరీనాలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవెంట్రీ, రగ్బీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించి వేదికపై చిన్నారుల యాంకరింగ్, నృత్య ప్రదర్శనలు, ఆటలు, పాటలు, వినోదభరితమైన కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
పద్మావతి పులమారసెట్టి చిన్నారులతో కలిసి ప్రదర్శించిన నవదుర్గా నృత్యం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపావళి ఇతివృత్తంతో చిన్నారులు ప్రదర్శించిన సంగీత కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. మెట్ గాలా ఫ్యాషన్ వాక్, భక్తి ప్రధానమైన డివోషనల్ కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. అతిథులకు రుచికరమైన విందు భోజనంతో పాటు రిటర్న్ గిఫ్ట్స్‌గా స్వీట్లు, పటాసులు అందజేశారు.
Chief Minister Revanth Reddy inaugurated an Indiramma house in Parsapur village, Kodangal mandal, and shared a meal and Diwali celebrations with the beneficiary family. The event was attended by Speaker Gaddam Prasad Kumar, several ministers, and other MLAs.
Telangana Minister Ponnam Prabhakar celebrated Diwali with beneficiaries of the Indiramma housing scheme in the Hanumakonda district, distributing sweets and firecrackers. He also cut a cake to mark Chief Minister Revanth Reddy's birthday.
The article describes several villages across Tamil Nadu and Assam that celebrate 'Silent Diwali' by forgoing firecrackers to protect local birds and bats. These traditions, passed down through generations, involve lighting lamps, performing prayers, and sharing sweets instead.
పండగొచ్చిందంటే అందరూ ఒకచోట కలుసుకోవడం, ఆనందంగా గడపడం.. బోలెడన్ని అనుభూతుల్ని మూటగట్టుకోవడం మనకు అలవాటే! ఈ సంతోషంలో చిన్ననాటి పండగ జ్ఞాపకాలు, బాగా గుర్తుండిపోయిన సంఘటనల్ని నెమరువేసుకుంటూ సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం....
పండగొచ్చిందంటే అందరూ ఒకచోట కలుసుకోవడం, ఆనందంగా గడపడం.. బోలెడన్ని అనుభూతుల్ని మూటగట్టుకోవడం మనకు అలవాటే! ఈ సంతోషంలో చిన్ననాటి పండగ జ్ఞాపకాలు, బాగా గుర్తుండిపోయిన సంఘటనల్ని నెమరువేసుకుంటూ సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. దీపావళికి సంబంధించిన అలాంటి స్వీట్ మెమరీస్ తమకూ బోలెడున్నాయంటున్నారు కొంతమంది తారలు. మరి ఆ మధురానుభూతులేంటో వాళ్ల మాటల్లోనే విందాం రండి..
Diwali 2026: దీపావళి ఎలా మొదలైంది? సత్యభామ నరకాసురుడిని వధించింది ఇక్కడే..
Not analysed for framing
Diwali Festival 2026| ఇంటర్నెట్ డెస్క్: చీకట్లను చీల్చే దివ్వెల వెలుగులు, బాణసంచా మెరుపుల మధ్య అందరూ సంతోషంగా చేసుకొనే పండుగ దీపావళి (Diwali 2026). సాధారణంగా ఈ పండుగ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి నరకాసుర వధ, ఆ రాక్షస పీడ విరగడైనందుకు ప్రజలు చేసుకొనే సంబరాలు. శ్రీకృష్ణ పరమాత్ముడి సారథ్యంలో సత్యభామ బాణం ఎక్కుపెట్టి నరకాసురుడిని సంహరించిందన్న పురాణ గాథ అందరికీ తెలిసిందే. కానీ, సత్యభామ చేతిలో నరకాసురుడి వధ అసలు ఏ గడ్డ మీద ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? దీపావళి వేళ ఆ విశేషాలు మీకోసం.. (Diwali Special story)
ద్వాపరయుగంలో నరకుడు ప్రాగ్నోషికపురం అనే ప్రాంతాన్ని పాలించేవాడు. శివుడి కోసం నరకుడు ఘోర తపస్సు చేసి, తల్లి వల్ల తప్ప మరొకరి వల్ల తనకు మృత్యువు సంభవించకూడదనే వరాన్ని పొందుతాడు. ఒకరోజు నరకుడు వేటకు వెళ్లగా జంతువుని చంపడానికి వేసిన బాణం గురితప్పి ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగిలి మరణిస్తాడు. విషయం తెలుసుకున్న నరకుడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలో చెప్పాలని గురువును ఆశ్రయిస్తాడు. జరిగింది తెలుసుకున్న గురువు ‘‘కృష్ణానదీ తీరంలో భూమి నుంచి ఉద్భవించిన శివలింగం ఉంది. ఆ స్వామిని పుష్కరకాలం పాటు అర్చించడం ద్వారా ఈ దోషం నుంచి విముక్తి పొందగలవు’’ అని చెబుతాడు. దీంతో నరకుడు…
వరంగల్ ఎన్జీవో కాలనీ: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి వెలుగులు నింపాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని 57వ డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు అయిన కొమురమ్మ కుటుంబంతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు నూతన వస్త్రాలు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులకు స్వీట్లు తినిపించి, వారితో కలిసి బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఒక కుటుంబానికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన ఇంటిని సీఎం ప్రారంభించారు.
పర్సాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతుల నూతన గృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి ప్రారంభోత్సవం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి వారి ఇంట్లోనే భోజనం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో తయారుచేసిన భోజనం తిన్నారు.
లింగంపేట: కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కాంగ్రెస్ నాయకులు దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచి కౌడ రవి, లింగంపేట పీఏసీఎస్ ఛైర్మన్ బుర్ర నారా గౌడ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి ప్రసాద్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరులో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ నివాసాల్లో ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం ఆదివారం వేడుకగా జరిగింది. కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడంతోపాటు ఇళ్ల లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులకు స్వయంగా స్వీట్లు తినిపించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Upcoming Movies New posters released: దీపావళి స్పెషల్.. కొత్త పోస్టర్లు రిలీజ్
Not analysed for framing
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సినీ అభిమానులకు డబుల్ ధమాకాను తీసుకొచ్చింది. పండుగ కానుకగా తమ సినిమాల అప్డేట్స్తో మేకర్స్ సందడి చేస్తున్నారు. రాబోయే క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. ఈ దీపావళికి సందడి చేస్తున్న ఆ సరికొత్త పోస్టర్లపై ఓ లుక్కేద్దాం..
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ 100’ (King 100). తమిళ నటుడు అశోక్ సెల్వన్ (AshokSelvan) ఈ సినిమాలో ‘కర్ణ’గా మాస్ అవతార్‌లో కనిపించనున్నారని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. శక్తిమంతమైన పాత్రలో అశోక్ సెల్వన్ నటిస్తున్నట్లు వెల్లడించింది. రా.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా.. డిసెంబర్ 24న విడుదల కానుంది.
Upcoming Movies New posters released: దీపావళి స్పెషల్.. కొత్త పోస్టర్లు రిలీజ్
Entertainment — not analysed for political framing
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సినీ అభిమానులకు డబుల్ ధమాకాను తీసుకొచ్చింది. పండుగ కానుకగా తమ సినిమాల అప్డేట్స్తో మేకర్స్ సందడి చేస్తున్నారు. రాబోయే క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. ఈ దీపావళికి సందడి చేస్తున్న ఆ సరికొత్త పోస్టర్లపై ఓ లుక్కేద్దాం..
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ 100’ (King 100). తమిళ నటుడు అశోక్ సెల్వన్ (AshokSelvan) ఈ సినిమాలో ‘కర్ణ’గా మాస్ అవతార్‌లో కనిపించనున్నారని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. శక్తిమంతమైన పాత్రలో అశోక్ సెల్వన్ నటిస్తున్నట్లు వెల్లడించింది. రా.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా.. డిసెంబర్ 24న విడుదల కానుంది.
Silent Diwali | దీపావళి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా బాణసంచా సందడి మొదలవుతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే మన దేశంలో కొన్ని గ్రామాల్లో మాత్రం దీపావళి రోజు బాణసంచా కాల్చరు. కనీసం పెద్ద శబ్దాలు చేసే టపాసుల జోలికి కూడా వెళ్లరు. పండుగను దీపాలు వెలిగించి, పూజలు చేసి, స్వీట్లు పంచుకుంటూ జరుపుకుంటారు. ఇదేదో ప్రభుత్వ ఆంక్షల వల్ల అనుకుంటే పొరబడినట్లే. తమ గ్రామాల్లో నివసించే పక్షులు, గబ్బిలాలు, ఇతర జీవులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయి? వాటి వెనుక ఉన్న…
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న బాల్లెనహళ్లి గ్రామంలో దీపావళి వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ దాదాపు 2 వేల గబ్బిలాలు గ్రామంలోని ఆలయం సమీపంలో ఉన్న చెట్లపై నివసిస్తున్నాయి. వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని గ్రామస్తులు బాణసంచా కాల్చడం మానేశారు. నాలుగు తరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గబ్బిలాలను కూడా తమ గ్రామ దేవుడు మునియప్పతో సమానంగా భావిస్తామని చెబుతున్నారు. పిల్లలకు టపాసులు కాల్చాలనిపిస్తే గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పొలాల వైపు వెళ్లి కాల్చుకోవాలని సూచిస్తారు. పండుగ రోజున ఇక్కడ దీపాలు వెలిగించి, పూజలు చేసి, విందు భోజనాలతో ఆనందంగా గడుపుతారు.
Entertainment — not analysed for political framing
IdupuKayitham | ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’ (IdupuKayitham) . ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని తెలిసిందే.
ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఇడుపు కాయితం సినిమా నుంచి ‘బారాత్ బీట్ ‘.. (BaraatBeat) సాంగ్ రిలీజ్ చేశారు.
న్యూయార్క్: అమెరికాలోని సియాటిల్‌లో దీపావళి(US Diwali) వేడుకను అతివాదులు అడ్డుకున్నారు. అమెరికా ఫార్ రైట్ కార్యకర్త జేక్ లాంగ్, తనతో కలిసిన కొందరు గ్రూపు సభ్యులు .. దీపావళి పండుగ సంబరాలను అడ్డుకున్నారు. కార్యక్రమం వద్ద ప్లకార్డులు పట్టుకున్నారు. డాట్ హెడ్స్‌ను డిపోర్ట్ చేయాలని లాంగ్ ప్లకార్డు ప్రదర్శించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు అతన్ని భౌతికంగా నిలువరించారు. తన ఎక్స్ అకౌంట్లో లాంగ్ కొన్ని ఫోటోలను పోస్టు చేశారు. హిందువులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లో డెమోక్రటిక్ పార్టీ గెలవడానికి హిందువులే కారణమని ఆయన ఆరోపించారు.
వైట్ రిప్లేస్మెంట్ అనే సంస్థకు లాంగ్ అధిపతిగా ఉన్నారు. అమెరికా క్యాపిటల్ హిల్‌పై 2021 జనవరి ఆరో తేదీన జరిగిన ఘటనలోనూ అతను ఉన్నాడు. నాలుగేళ్లు జైలుశిక్ష అనుభవించాడు. ట్రంప్ అతనికి క్షమాభిక్ష పెట్టారు. దీంతో అతను 2025లో రిలీజ్ అయ్యాడు. రెండు రోజుల క్రితమే శ్వేత సౌధంలో ట్రంప్ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.