Namasthe Telangana ·
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
– రూ. 7 కోట్లు విలువ చేసే బియ్యం పక్కదారి
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 02 : సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మేదరబస్తీలోని మురళికృష్ణ రైస్ మిల్లు యజమాని, కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల మురళి గోపాలకృష్ణ, కో పార్టనర్ అంజనమ్మపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. రైతుల నుండి సేకరించిన 2,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొత్తగూడెం నగరంలోని మేదరబస్తీలో గల మురళికృష్ణ రైస్ మిల్లుకు అప్పగించారు. ఈ సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లు పట్టించిన అనంతరం ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా మిల్లు యజమాని ఆళ్ల మురళి పక్కదారి పట్టించాడు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతగా చలామణి అవుతున్న ఆళ్ల మురళి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక…