We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
BJP MP Manoj Tiwari from North East Delhi jumped into the Yamuna river, swam, and drank the water, releasing a video of the act. He claimed the river has been cleaned over the last two and a half years.
న్యూఢిల్లీ: యమునా నదిలో తీవ్రమైన కాలుష్యం ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ(MP Manoj Tiwari) ఇవాళ యమునా నదిలో దూకారు. ఆ నీటిలో ఈత కొట్టి స్నానం చేశారు. ఇంకా ఆ నీటిని తాగారు కూడా. సోనియా విహార్ ఘాట్‌లో ఆయన స్విమ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. రెండున్నర ఏళ్లుగా రేఖా గుప్తా ప్రభుత్వం యమునా నదిని శుభ్రం చేసినట్లు ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇప్పుడు యమునా నదిలో ఛాత్ పూజను సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నారు. కొన్ని ప్రదేశాల్లో వలస పక్షులు కనిపిస్తున్నాయని, అంటే…
केजरीवाल जी और राहुल गांधी जी, यह रील नहीं, हकीकत है।
According to the article, Telangana Congress leaders, including Chief Minister Revanth Reddy, departed for Delhi to attend the 'Vote Bachao - Desh Bachao' rally organized by the INDIA alliance on November 1, 2026.
The Supreme Court issued key directives regarding firecrackers in Delhi for Diwali, stating that a complete ban is not feasible and that bursting them 24/7 is prohibited.
Congress President Mallikarjun Kharge announced that the INDIA alliance will hold a massive protest in Delhi on November 1 against alleged irregularities in the voter list revision process.
న్యూఢిల్లీ: నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ఎత్తును కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించనున్నది. ఆ ర్యాలీలో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఆ ర్యాలీని వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపారులు(Delhi Traders) ఇవాళ కాంగ్రెస్ నేత సోనియా గాంధీని వేడుకున్నారు. దీపావళి సీజన్ షాపింగ్ జరుగుతోంది కాబట్టి , ర్యాలీ వల్ల సుమారు 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే ఆ ప్రతిపాదిత ర్యాలీని వాయిదా వేసుకోవాలని సోనియాను ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కోరింది.
ఢిల్లీలో ఆందోళనలు చేయడం వల్ల సుమారు 20 కీలక మార్కెట్లకు నష్టం జరిగే ఛాన్సు ఉన్నట్లు వాణిజ్య సంఘాలు తెలిపాయి. నవంబర్ 11 తర్వాత ర్యాలీ నిర్వహించుకోవాలని, లేదంటే బురారీ గ్రౌండ్‌కు మార్చుకోవాలని వ్యాపారులు కోరారు. రామ్‌లీలా మైదానంలో ర్యాలీ వల్ల పార్కింగ్ సమస్యలు వస్తాయని, దీంతో సుమారు 20 లక్షల మంది వ్యాపారులపై వత్తిడి ఉంటుందని సీటీఐ తన అభ్యర్థనలో పేర్కొన్నది.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన పార్టీ ధర్నా కోసం కాంగ్రెస్ కులసంఘాలకు ఎరవేస్తున్నది. జనసమీకరణ కోసం ఒక్కో సంఘానికి ఒక్కో తాయిలాన్ని ప్రకటిస్తున్నది. వారు కోరిన కోర్కెలు నెరవేర్చుతున్నది. బస్సులతోపాటు చేతి ఖర్చులకు నిధులను సమకూర్చుతామని లాబీయింగ్ చేస్తున్నది. మరోవైపు కులసంఘాల తీరుపై బీసీ సంఘాల మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తీరు కులసంఘాలు, మేధావుల మధ్య చిచ్చురేపుతున్నది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)ను, ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నవంబర్ ఒకటిన భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు రాష్ట్రం నుంచి భారీగా జనసమీకరణ చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో కులసంఘాలతో మంతనాలు సాగిస్తున్నది.
గట్టుప్పల్, అక్టోబర్ 29 : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కర్నాటి వజ్రమ్మ వెంకటేశం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నాటి వజ్రమ్మ జాతీయ స్థాయిలో చేనేత రంగానికి సేవలు చేయాలని కాంక్షిస్తూ కేటీఆర్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో చేనేత రంగంపై పలు అంశాలను చర్చించారు. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి, నేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు…
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బాణాసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించలేమని దేశ సర్వోన్నత న్యాయ స్పష్టం చేసింది. దీపావళి పండుగ ప్రజల్లో ఒక సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని.. అలాంటి పండుగ వేళ ప్రజల మనోభావాలను దెబ్బతీయలేమని తెలిపింది. అయితే, సంపూర్ణ నిషేధం విధించనప్పటికీ రోజంతా నిరంతరాయంగా (24 గంటలూ) టపాసులు కాల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నిర్దేశిత సమయాల్లో మాత్రమే బాణాసంచా కాల్చేలా ఆంక్షలు ఉంటాయని తెలిపింది. బాణసంచా వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టడానికి ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినంగా అమలు…
ఢిల్లీ-ఎన్సీఆర్లో పెరుగుతున్న కాలుష్యం, బాణసంచాపై నిషేధం విధించే అంశంపై గురువారం (అక్టోబర్ 29) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కేవలం ఆంక్షలు విధించడం సరిపోదని పేర్కొంది. ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు, అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటం కూడా అత్యవసరమని సూచించింది.
ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ పోరాట లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ్ణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓట్ల చోరీ, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్…
వాయిదా వేయాలని వ్యాపార సంఘాల విజ్ఞప్తిపండుగల సీజన్లో భారీ ర్యాలీ నిర్వహిస్తే ఢిల్లీలో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయని పలు వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ర్యాలీని మరో తేదీకి మార్చాలని రాహుల్ గాంధీని కోరాయి. పెద్ద ఎత్తున జనసమీకరణ వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతినడంతో పాటు తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని వ్యాపారులు పేర్కొన్నారు. అయితే ఈ విజ్ఞప్తుల నేపథ్యంలోనూ నవంబర్ 1న నిరసన కొనసాగుతుందని ఖర్గే స్పష్టం చేశారు.
ఢిల్లీలో పండుగ సమయాల్లో మద్యం షాపుల వద్ద కనిపించే రద్దీకి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (DSIIDC) 'ఢిల్లీ లిక్కర్ బుకింగ్' యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఆన్లైన్లోనే తమకు నచ్చిన బ్రాండ్లను ముందే బుక్ చేసుకోవచ్చు.
ఈ విధానం ద్వారా ఇంట్లోనే కూర్చుని మద్యం ఆర్డర్ చేసి డెలివరీ పొందలేమనే విషయం గమనించాలి. ఇది కేవలం ఆన్లైన్ రిజర్వేషన్, ముందస్తు చెల్లింపుల సేవ మాత్రమే. యాప్ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత వినియోగదారునికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ వస్తుంది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.