We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ తన పునరాగమనం వెనుక డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేదంటూ వార్తలను ఖండించారు. జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని బోర్డు సమీక్షించి నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
చిప్‌మేకర్ దిగ్గజం ఎన్విడియా అధినేతగా తిరిగి బాధ్యతలు చేపట్టిన జెన్సన్ హువాంగ్, తన పునరాగమనం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అందులో ఎలాంటి నిజంలో లేదన్నారు. బోర్డు వాస్తవాలను సమీక్షించి, జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ నియామకంపై డొనాల్డ్ ట్రంప్ భిన్నంగా స్పందించారు. తానే ఎన్విడియా బోర్డు సభ్యులతో మాట్లాడి, జెన్సన్ను తిరిగి తీసుకోవాలని ఒప్పించానని ఆయన సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను వారితో మాట్లాడాను. వారిని ఒప్పించానుఁ అని ట్రంప్…
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ 11 రోజుల విరామం తర్వాత తిరిగి బాధ్యతలు చేపట్టారు. కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు.
అమెరికాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని వార్తలు వస్తున్నాయి.
11 రోజుల విరామం తర్వాత ఎన్విడియా సీఈఓగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన జెన్సన్ హువాంగ్‌కు ఉద్యోగులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. సోమవారం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలోకి ఆయన అడుగుపెట్టగానే పండగ వాతావరణం నెలకొంది. ఆఫీసులోని అంతస్తులు, బాల్కనీల వద్ద వందలాది మంది సిబ్బంది బారులు తీరి నిలబడ్డారు. తమ అభిమాన నాయకుడిని చూడగానే చప్పట్లు, ఈలలతో హోరెత్తిస్తూ 'జెన్సన్.. జెన్సన్.. జెన్సన్' అంటూ నినాదాలు చేశారు. ఆ అద్భుత దృశ్యాలను ఉద్యోగులు తమ ఫోన్లలో రికార్డ్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
తన సిగ్నేచర్ బ్లాక్ లెదర్ జాకెట్లో ఎంట్రీ ఇచ్చిన హువాంగ్ను చూసి కొందరు ఉద్యోగులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన లోపలికి రాగానే పలువురు సిబ్బంది పరుగెత్తుకుంటూ వెళ్లి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఒక ఉద్యోగి ఆయన్ను గట్టిగా కౌగిలించుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అనూహ్య ప్రేమకు చలించిపోయిన హువాంగ్.. తన గుండెపై చేయి వేసుకుని ఉద్యోగులకు అభివాదం చేశారు. తనకు 2వ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు హువాంగ్. ఈసారి గతంలో కంటే మరింత మెరుగైన సీఈఓగా పనిచేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు.
ప్రపంచంలో ఎక్కడ ఏ రాజీ జరిగినా, సర్దుబాటు జరిగినా, శాంతి ఒప్పందాలు కుదిరినా క్రెడిట్ తీసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొస్తున్నారు. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునర్నియామకంలో కూడా తానే ఎన్విడియా బోర్డు డైరెక్టర్లతో మాట్లాడి ఒప్పించినట్లు ట్రంప్ చెప్పారు. ఎన్విడియా బోర్డు డైరెక్టర్లతో మాట్లాడి, జెన్సన్ హువాంగ్ ను మళ్లీ సీఈఓగా నియమించేలా వారిని ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
President Donald J. Trump on the process of Jensen Huang being reinstated as Nvidia CEO: “I was talking to a lot of people, and I was talking to a lot of people that you interview all the time. But I was also dealing with a Vice President, JD Vance who’s great.” https://t.co/N4CmJ4TwEn
ఎన్విడియా సీఈఓ, ప్రెసిడెంట్‌గా జెన్సన్ హువాంగ్ తిరిగి నియమితులయ్యారు. నవంబర్ 12న రాజీనామా చేసిన హువాంగ్ను బోర్డు ఏకగ్రీవంగా తిరిగి ఆహ్వానించింది. జాతీయ భద్రతకు ముప్పు లేదని అమెరికా ప్రభుత్వం నుంచి అందిన సమాచారంతో బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే.. విదేశీ నిఘా సంస్థల ఆరోపణలపై హువాంగ్‌పై విచారణ కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది.
డిసెంబర్ 1, 2 తేదీల్లో అమెరికా హౌస్ కమిటీల ముందు హువాంగ్ విచారణకు హాజరుకానున్నారు. చైనా గూఢచారి సంస్థ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న ఓ మహిళతో హువాంగ్‌కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా అధికారులు అనుమానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కారణంగానే ఎన్విడియా సీఈఓ, ప్రెసిడెంట్‌గా జెన్సన్ హువాంగ్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన రాజీనామా తర్వాత సీఎఫ్ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.