We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
న్యూఢిల్లీలో కారు, బైక్ ఇన్సూరెన్స్ కోసం ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా త్వరలో కొత్త విధానం రానుంది. బీమా నియంత్రణ సంస్థ (IRDAI) ఆధ్వర్యంలో రూపొందిన ‘బీమా సుగమ్’ అనే ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ ఈ వారం అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ: కారు, బైక్ ఇన్సూరెన్స్ చేయించాలంటే ఏజెంట్ల చుట్టూ తిరగడం, అధిక కమీషన్ల భారం మోయడం వంటి సమస్యలకు త్వరలోనే తెరపడనుంది. బీమా నియంత్రణ సంస్థ (ఐఆ…
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 1389మంది భారతీయ చిన్నారులను నిర్బంధించారని వాషింగ్టన్ నుండి నివేదిక పేర్కొంది. 2023 నుండి ఈ పిల్లలు అధికారుల కస్టడీలోనే ఉన్నారని, ఎవరినీ వెనక్కి పంపించలేదని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా వెల్లడించింది.
మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు, ఆమెను స్వాగతం పలకడం కోసం విద్యార్థులను ఎండలో నిలబెట్టారు. దీనిపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ఫైనల్ వార్నింగ్ అని, మళ్లీ పిల్లలను ఇలా ఎండలో నిలబెట్టకూడదని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, ప్రతినిధులకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రవేశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమ్మిట్ కోసం ఫుడ్ కోర్టులు, మెరుగైన ఇంటర్నెట్ నెట్వర్క్, లైజనింగ్ ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా భవన నిర్మాణ నిబంధనలు తీవ్ర ఉల్లంఘనలకు గురి కావడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమార్కులతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కై సహకారం అందించడంపైనా మండిపడింది. పట్టణ ప్రణాళిక విభాగం ముందస్తు అనుమతులను తమ కళ్ల ముందే అతిక్రమిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ధర్మాసనం అభిప్రాయపడింది. అనధికార నిర్మాణాలపై దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. భవన నిర్మాణం ప్రతి దశనూ నిశితంగా పరిశీలిస్తూ అతిక్రమణలకు పాల్పడితే వెంటనే కూల్చివేతలకు ఆదేశాలివ్వాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని…
వాషింగ్టన్ : అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 1389మంది భారతీయ చిన్నారులను నిర్బంధించారు. వీరంతా తోడు ఎవరూ లేని పిల్లలే, 2023 నుండి వీరందరూ అధికారుల కస్టడీలోనే వున్నా ఎవరినీ వెనక్కి పంపించలేదని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా వెల్లడించింది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేకుండా ప్రయాణిస్తున్న భారతీయ మైనర్ల సంఖ్య 2023లో 730గా వుండగా, 2024లో 517కు, 2025లో 91కి, 2026లో 51కి తగ్గింది. ఈ ఏడాది అక్టోబరులో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేవలం భారతీయులే కాదు, మొత్తంగా అన్ని దేశాలకు చెందిన చిన్నారుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు నమోదయ్యాయి. అన్ని దేశాలకు చెందిన మైనర్ల…
Sneha Shabarish | కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఏదైనా కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో స్కూల్ విద్యార్థులతో స్వాగతం పలికిస్తుంటారని తెలిసిందే. అయితే విద్యార్థులతో ఇలా చేయించడం అవసరం లేదని, అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టొద్దని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులను లైన్లో నిలబెట్టారు. వారిని చూసిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఇది ఫైనల్ వార్నింగ్.. మళ్లీ ఎప్పుడు పిల్లలను ఇలా ఎండలో నిల్చోబెట్టకూడదని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ ఫైర్ అయ్యారు. ఇంత ఎండలో ఎందుకు నిలబడ్డారు.. దయచేసి లోపలికి వెళ్లండి.. అని వారికి సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Wingless Flying Car: కారు అంటే రోడ్డుపై నడిచేది.. విమానం, హెలికాఫ్టర్ అంటే గాల్లో ఎగిరేది అనే ముచ్చట ఇప్పటి వరకు ఇదే అందరికీ తెలిసిన సంగతి.. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. గాల్లో ఎగిరే కార్లు వచ్చేశాయి. మొన్నటికి మొన్న ఎలాన్ మాస్క్ ఫ్లయింగ్ కారు విడుదల చేసిన తర్వాత.. పోటా పోటీగా చైనా తన ప్రయోగాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. రెక్కలు లేకుండా గాల్లో ఎగిరే విమానం ప్రయోగం సక్సెస్ అయినట్లు చైనా ప్రకటించింది. ఆటోమొబైల్ రంగంలోనే ఇది అద్భుత ఆవిష్కరణగా ప్రపంచం నోరెళ్లబెతుంది. రెక్కలు లేని ఈ ఫ్లయింగ్ కారు విశేషాలని మీరు V6 వెలుగు వెబ్ సైట్ లో చూడండి..
భుజ్ (గుజరాత్): గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో జాతీయ రహదారిపై కారును ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు ఆర్మీ కుటుంబ సభ్యులు మృతి చెందారు.
కచ్ వెస్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి వివరాల ప్రకారం.. బాధితులంతా రణ్ ఆఫ్ కచ్ సందర్శన ముగించుకుని తిరిగి భుజ్‌కు వస్తున్నారు. ఈక్రమంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
జెరూసలెం: ఇజ్రాయెల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలు చేపట్టిన యషర్ పార్టీ చీఫ్ గాడీ ఐసెన్‌కోట్ కీలక అడుగు వేశారు. సంకీర్ణ చర్చల కోసం ఆపద్ధర్మ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీని ఆహ్వానించారు. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఐసెన్కోట్కు వచ్చే నెల వరకు గడువు ఉంది.
వీలైనంత విస్తృత స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ఆదివారం నుంచి లికుడ్ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరపనున్నట్టు యాషర్ పార్టీ శనివారం ప్రకటించింది. అయితే, అల్ట్రా-ఆర్థోడాక్స్ పార్టీలు, అరబ్ పార్టీలు లేదా నెతన్యాహు కూటమిలో ఎవరితో కలవాలనే దానిపై ఐసెన్‌కోట్ శిబిరంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఐసెన్‌కోట్ నేతృత్వంలో జియోనిస్ట్ ఐక్య ప్రభుత్వాన్ని కోరుకుంటున్నప్పటికీ, నెతన్యాహు కూటమితో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోమని తేల్చిచెప్పారు.
తాడ్వాయి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగు నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెల వరకు ఉద్యమకారులు పాదయాత్ర నిర్వహించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం పగిడిద్దరాజు భవన్లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9లోపు ఉద్యమకారులను గుర్తిస్తూ వెబ్సైట్ ప్రారంభించకపోతే సీఎం, మంత్రుల నివాసాలతో పాటు బీఆర్ఎస్, గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల ముట్టడికి తీర్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారుల ఫోరం తరఫున పోటీ చేయడంతో పాటు ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.