Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగు నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెల వరకు ఉద్యమకారులు పాదయాత్ర నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించారు.
అనంతరం పగిడిద్దరాజు భవన్లో జరిగిన సమావేశంలో వారి సంక్షేమం కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని కోరారు, డిసెంబర్ 9లోపు ప్రారంభించకపోతే సీఎం, మంత్రుల నివాసాలతో పాటు బీఆర్ఎస్, గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల ముట్టడికి తీర్మానించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
తాడ్వాయి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగు నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెల వరకు ఉద్యమకారులు పాదయాత్ర నిర్వహించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం పగిడిద్దరాజు భవన్లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9లోపు ఉద్యమకారులను గుర్తిస్తూ వెబ్సైట్ ప్రారంభించకపోతే సీఎం, మంత్రుల నివాసాలతో పాటు బీఆర్ఎస్, గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల ముట్టడికి తీర్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారుల ఫోరం తరఫున పోటీ చేయడంతో పాటు ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)