We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
మైలవరం సమీపంలోని మూలపాడులో గ్రీన్ ఫీల్డ్ హైవే పరిశీలనకు వచ్చిన ప్రభుత్వ అధికారులకు స్థానిక రైతులు నిరసన తెలిపారు. గతంలో పరిటాల గ్రామ రైతులకు కేటాయించిన రూ. 02 కోట్ల పరిహారంలో సగం మాత్రమే జమైందని మూలపాడు రైతులు అధికారులకు వివరించారు.
మైలవరం: గ్రీన్ ఫీల్డ్ హైవే పరిశీలనకు వచ్చిన అధికారులకు మూలపాడులో రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎందుకు వచ్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి గొల్లపూడి ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పరిశీలన కోసం వచ్చిన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. గతంలో పరిటాల గ్రామ రైతులకు రూ. 1.02 కోట్ల పరిహారం కేటాయించినప్పటికీ, అందులో కేవలం సగం నిధులు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని మూలపాడు రైతులు అధికారులకు వివరించారు. తమ సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపి, పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతే పనులు ముందుకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
చైనాలో ఇటీవల పరీక్షించిన ఒక ఎగిరే కారు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన ఫ్లయ్యింగ్ కారుతో పోలిస్తే భిన్నమైన డిజైన్‌తో రూపొందించిన ఈ కారుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిందని తెలిపింది.
దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీలు ముడిసరుకుల ధరలు, తయారీ ఖర్చుల కారణంగా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, ఆడి, మారుతి సుజుకి సంస్థలు ఈ ధరల పెంపును అమలు చేయనున్నాయి.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 1389మంది భారతీయ చిన్నారులను నిర్బంధించారని వాషింగ్టన్ నుండి నివేదిక పేర్కొంది. 2023 నుండి ఈ పిల్లలు అధికారుల కస్టడీలోనే ఉన్నారని, ఎవరినీ వెనక్కి పంపించలేదని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా వెల్లడించింది.
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకో ముఖ్యమైన విషయం. దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, మారుతి సుజుకి, ఆడి సంస్థలు ధరల పెంపును ప్రకటించాయి. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, తయారీ ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. కొన్ని కంపెనీల ధరల పెంపు 1 డిసెంబర్ 2026 నుంచి అమల్లోకి రానుండగా, మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలను సవరించాయి. మరి ఏ కంపెనీ కార్ల ధరలు ఎంత పెరుగుతున్నాయి ? కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుసుకుందాం....
టాటా కార్ల ధరలు టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్ల ధరలను కూడా పెంచుతోంది. మొత్తం కార్ల విభాగంలో సగటున 0.5 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే అన్ని మోడళ్లపై ఒకే స్థాయిలో ధరలు పెరగవు. కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయి. పెరుగుతున్న ఖర్చుల్లో కొంత భారాన్ని కంపెనీ భరిస్తున్నప్పటికీ, మిగిలిన కొంత మొత్తాన్ని కస్టమర్లపై వేయాల్సి వస్తోందని టాటా మోటార్స్ తెలిపింది.
అమరావతి : కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులను ( Fishermen ) సురక్షితంగా తీసుకు వచ్చేందుకు గాలింపు చర్యలను( Search operations ) ముమ్మరం చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ( Y.S. Jagan ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మత్స్యకార కుటుంబాల ఆవేదనను అర్ధం చేసుకుని గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సహకారంతో గాలింపు చర్యలను చేపట్టాలని సూచించారు.
మత్స్యకారుల గల్లంతు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఈ నెల 4న చేపల వేటకు వెళ్లిన రెండు బోట్లలో ఒకటి తిరిగి రాగా, మరో బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం కలవరపాటుకు గురిచేస్తుందని పేర్కొన్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను క్షేమంగా తిరిగి తీసుకురావాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.
అమరావతి : సముద్రపు వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ( Seven Fishermen ) బోటు గల్లంతు ( Boat Missing ) కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 11న కాకినాడ జిల్లా యు.కొత్తప్లి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఈనెల 14 వరకు ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత ఇప్పటి వరకు వారి సమాచారం తెలియరాలేదు.
గత 13 రోజులుగా వారి ఆచూకీ తెలియాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా బోటు గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయు డు ఆరా తీశారు. తుపాను కారణంగా ఇతర దేశాల వైపు కొట్టుకెళ్లొచ్చని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. కాగా గల్లంతయిన వారు మయన్మార్ బంగ్లాదేశ్ వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు వరుసపెట్టి కార్ల ధరలు పెంచుతున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచగా.. ఇప్పుడు టాటా మోటార్స్ (Tata Motors Passenger), హ్యుందాయ్ (Hyundai Motor India), ఆడీ (Audi) కంపెనీలూ అదే బాట పట్టాయి.
తన మొత్తం పోర్ట్‌ఫోలియోలోని అన్ని ఎస్‌యూవీలు, కార్ల ధరలను 0.5 శాతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వెల్లడించింది. కొత్త ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఈ ధరల పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్స్ కూడా ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.8 వేల వరకు పెంచింది. కొత్త ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ కూడా భారత్ మోడళ్లలోని ఎక్స్‌షోరూం ధరలను రెండు శాతం వరకు పెంచింది. కొత్త ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మరిన్నీ ఆటో మొబైల్…
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Not analysed for framing
Rahul Gandhi : తన తండ్రి రాజీవ్‌గాంధీ (Rajiv Gandhi) ప్రాణాలకు ముప్పు ఉన్నదని, ఆ ముప్పును తప్పించడానికి ఏం చేయకపోతే త్వరలోనే తాను ఆయన అంత్యక్రియలకు తిరిగి రావాల్సి వస్తుందని.. అప్పట్లో తాను తన తల్లి సోనియాగాంధీ (Sonia Gandhi) కి చెప్పిన విషయాన్ని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) గుర్తుచేసుకున్నారు. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) తో కలిసి ఓ మీడియా ఛానెల్లో తన తల్లి ఆత్మకథపై చర్చించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ హత్య విషయాన్ని ప్రస్తావించారు.
నాడు తన తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారని అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా ఎయిర్‌లైన్ పైలట్ అయిన రాజీవ్ గాంధీ.. ఇందిరా గాంధీ హత్య తర్వాత అనూహ్యంగా ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి భారీ భద్రతతో ఉండేవారు. దీనిపై ప్రతిపక్షాలు ఆయనను ఎగతాళి కూడా చేశాయి. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. రాజీవ్‌గాంధీ ప్రధాని పదవిని కోల్పోయారు.
రోజు రోజుకూ పెరిగిపోతున్న హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణపై సంచలన నివేదిక వెల్లడైంది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ తగ్గాలంటే ఇకనుంచి కంజెషన్ ఛార్జీలు వసూలు చేయాలని నివేదిక పేర్కొంది. అత్యంత రద్దీ ఉన్న రోడ్లపై కంజెషన్ ఛార్జీ వసూలు చేస్తే ప్రయాణ సమయం తగ్గుతుందని, ఆ నిధులను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధికి వినియోగిస్తే కారు ప్రయాణికులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని కొత్త అధ్యయనం తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం.. కారులో ఒక్కరే ప్రయాణిస్తే జరిమానా విధించాలని నివేదిక పేర్కొంది. హైదరాబాదులో హైటెక్ సిటీలాంటి రద్దీగా ఉండే ఏరియాల్లో గంటకు10 వేలకు పైగా వాహనాలు వెళ్తుండగా.. 6 వేల 500 వాహనాల్లో డ్రైవర్ ఒక్కరే వెళ్తున్నట్లు నివేదిక తెలిపింది. దీంతో ట్రాఫిక్ పెరుగుతున్నట్లు పేర్కొంది. కంజెషన్ ఛార్జీలు వేయటం ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపవచ్చునని పేర్కొంది.
ఇనుగుర్తి: ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం నీటిని ఆదా చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీరు వృథా అవుతూనే ఉంది. దీనిని అధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో గత కొన్ని నెలలుగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని నాయకులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అందే తాగునీరు వృథాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
న్యూఢిల్లీ: కారు, బైక్ ఇన్సూరెన్స్ చేయించాలంటే ఏజెంట్ల చుట్టూ తిరగడం, అధిక కమీషన్ల భారం మోయడం వంటి సమస్యలకు త్వరలోనే తెరపడనుంది. బీమా నియంత్రణ సంస్థ (ఐఆ…
దిల్లీ: దేశవ్యాప్తంగా భవన నిర్మాణ నిబంధనలు తీవ్ర ఉల్లంఘనలకు గురి కావడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమార్కులతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కై సహకారం అందించడంపైనా మండిపడింది. పట్టణ ప్రణాళిక విభాగం ముందస్తు అనుమతులను తమ కళ్ల ముందే అతిక్రమిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ధర్మాసనం అభిప్రాయపడింది. అనధికార నిర్మాణాలపై దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. భవన నిర్మాణం ప్రతి దశనూ నిశితంగా పరిశీలిస్తూ అతిక్రమణలకు పాల్పడితే వెంటనే కూల్చివేతలకు ఆదేశాలివ్వాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని…
వాషింగ్టన్ : అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 1389మంది భారతీయ చిన్నారులను నిర్బంధించారు. వీరంతా తోడు ఎవరూ లేని పిల్లలే, 2023 నుండి వీరందరూ అధికారుల కస్టడీలోనే వున్నా ఎవరినీ వెనక్కి పంపించలేదని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా వెల్లడించింది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేకుండా ప్రయాణిస్తున్న భారతీయ మైనర్ల సంఖ్య 2023లో 730గా వుండగా, 2024లో 517కు, 2025లో 91కి, 2026లో 51కి తగ్గింది. ఈ ఏడాది అక్టోబరులో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేవలం భారతీయులే కాదు, మొత్తంగా అన్ని దేశాలకు చెందిన చిన్నారుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు నమోదయ్యాయి. అన్ని దేశాలకు చెందిన మైనర్ల…
Sneha Shabarish | కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఏదైనా కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో స్కూల్ విద్యార్థులతో స్వాగతం పలికిస్తుంటారని తెలిసిందే. అయితే విద్యార్థులతో ఇలా చేయించడం అవసరం లేదని, అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టొద్దని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులను లైన్లో నిలబెట్టారు. వారిని చూసిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఇది ఫైనల్ వార్నింగ్.. మళ్లీ ఎప్పుడు పిల్లలను ఇలా ఎండలో నిల్చోబెట్టకూడదని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ ఫైర్ అయ్యారు. ఇంత ఎండలో ఎందుకు నిలబడ్డారు.. దయచేసి లోపలికి వెళ్లండి.. అని వారికి సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Wingless Flying Car: కారు అంటే రోడ్డుపై నడిచేది.. విమానం, హెలికాఫ్టర్ అంటే గాల్లో ఎగిరేది అనే ముచ్చట ఇప్పటి వరకు ఇదే అందరికీ తెలిసిన సంగతి.. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. గాల్లో ఎగిరే కార్లు వచ్చేశాయి. మొన్నటికి మొన్న ఎలాన్ మాస్క్ ఫ్లయింగ్ కారు విడుదల చేసిన తర్వాత.. పోటా పోటీగా చైనా తన ప్రయోగాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. రెక్కలు లేకుండా గాల్లో ఎగిరే విమానం ప్రయోగం సక్సెస్ అయినట్లు చైనా ప్రకటించింది. ఆటోమొబైల్ రంగంలోనే ఇది అద్భుత ఆవిష్కరణగా ప్రపంచం నోరెళ్లబెతుంది. రెక్కలు లేని ఈ ఫ్లయింగ్ కారు విశేషాలని మీరు V6 వెలుగు వెబ్ సైట్ లో చూడండి..
భుజ్ (గుజరాత్): గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో జాతీయ రహదారిపై కారును ట్రక్కు ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు ఆర్మీ కుటుంబ సభ్యులు మృతి చెందారు.
కచ్ వెస్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి వివరాల ప్రకారం.. బాధితులంతా రణ్ ఆఫ్ కచ్ సందర్శన ముగించుకుని తిరిగి భుజ్‌కు వస్తున్నారు. ఈక్రమంలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
జెరూసలెం: ఇజ్రాయెల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలు చేపట్టిన యషర్ పార్టీ చీఫ్ గాడీ ఐసెన్‌కోట్ కీలక అడుగు వేశారు. సంకీర్ణ చర్చల కోసం ఆపద్ధర్మ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీని ఆహ్వానించారు. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఐసెన్కోట్కు వచ్చే నెల వరకు గడువు ఉంది.
వీలైనంత విస్తృత స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ఆదివారం నుంచి లికుడ్ ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరపనున్నట్టు యాషర్ పార్టీ శనివారం ప్రకటించింది. అయితే, అల్ట్రా-ఆర్థోడాక్స్ పార్టీలు, అరబ్ పార్టీలు లేదా నెతన్యాహు కూటమిలో ఎవరితో కలవాలనే దానిపై ఐసెన్‌కోట్ శిబిరంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఐసెన్‌కోట్ నేతృత్వంలో జియోనిస్ట్ ఐక్య ప్రభుత్వాన్ని కోరుకుంటున్నప్పటికీ, నెతన్యాహు కూటమితో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోమని తేల్చిచెప్పారు.
తాడ్వాయి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగు నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెల వరకు ఉద్యమకారులు పాదయాత్ర నిర్వహించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం పగిడిద్దరాజు భవన్లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9లోపు ఉద్యమకారులను గుర్తిస్తూ వెబ్సైట్ ప్రారంభించకపోతే సీఎం, మంత్రుల నివాసాలతో పాటు బీఆర్ఎస్, గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల ముట్టడికి తీర్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారుల ఫోరం తరఫున పోటీ చేయడంతో పాటు ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.