Eenadu ·
గుర్తుంచుకోవాలంటే తప్పదు రూ.లక్ష
కమలాపురం, సీకేదిన్నె, వల్లూరు, న్యూస్టుడే: ఎన్నికల్లో గుర్తులనేవి ఎంతో కీలకం. కొన్నిసార్లు అవే గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉమ్మడిగా వీటిని కేటాయించేందుకు కొన్ని నిబంధనలున్నాయి. ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలు అందుకు రూ.లక్ష రుసుం డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా చిహ్నాల జాబితా నుంచి కోరినది ఉమ్మడిగా కేటాయిస్తుంది. ఆ పార్టీల అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. పోటీ చేయని చోట్ల ఇతరులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. స్వతంత్రులుగా బరిలో నిలిచిన అభ్యర్థులకు కేటాయించేందుకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.