We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Honor killing | దేశంలో, రాష్ట్రంలో పరువు హత్యలు కొత్తేమీ కాదని తెలిసిందే. నిత్యం ఎక్కడో ఒక చోట పరువు హత్యా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కులాంతర ప్రేమ, కులాంతర వివాహాలకు సంబంధించి పరువు పోతుందని కన్న పిల్లలను చంపిన ఘటనలు ఉన్నాయి. అయితే దగ్గరి బంధువుల వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురునే కడతేర్చాడు ఓ తండ్రి. ఆమెకు అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ కావడమే దీనిక్కారణం..అంతేకాదు పరువు పోతుందనే కూతురుని హత్య చేసినట్టు అంగీకరించడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్, సుమిత్ర దంపతులు ఈ నెల 25వ తేదీన తమ కూతురు కళ్యాణి (18)కి వేరే యువకుడితో నిశ్చితార్థం ఖరారు చేశారు. అయితే ఈ నెల 23వ తేదీన కూతురు బాధపడుతూ ఉండడం గమనించిన కైలాస్ విషయమేంటని గట్టిగా నిలదీశాడు.
బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం నద్వాన్ గ్రామంలో జరగనుంది. ఈ వేడుకకు సుమారు 4 లక్షల మంది అతిథులు వస్తారని అంచనా వేస్తుండగా, భారీ పందిళ్లు, హెలిప్యాడ్లు, 150 రకాల వంటకాలు, గుర్రపు పందేలు ఏర్పాటు చేశారు.
బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు (నవంబర్ 25, బుధవారం) బర్హ్ ప్రాంతంలోని తన స్వగ్రామం నద్వాన్లో శివాంగి వివాహం జరగనుంది. అయితే ఈ పెళ్లి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. లక్షల మంది అతిథులు వస్తారని అంచనా వేస్తుండటంతో ఎనిమిది భారీ పందిళ్లు, ప్రత్యేక వీఐపీ ఏర్పాట్లు, భారీ భోజన వసతులు సిద్ధం చేశారు. అంతేకాదు, పెళ్లి వేడుకలో గుర్రపు పందేలు నిర్వహించి విజేతలకు మహీంద్రా థార్, బైక్, స్కూటర్లను గిఫ్ట్ గా ఇవ్వనున్నారు.
ఈ వివాహానికి దాదాపు 4 లక్షల మందికి పైగా అతిథులు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల నుండి సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు కూడా వస్తారని భావిస్తున్నారు. అయితే, అతిథులు ఎవరెవరు అనేది పూర్తి లిస్ట్ ఇంకా బయటకు రాలేదు.
మిర్యాలగూడ, న్యూస్‌టుడే: కూతురు ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తుంటే స్వయంగా తండ్రి ఇన్విజిలేషన్ విధులు నిర్వహించిన వైనం మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.... మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ తెలుగు అధ్యాపకుడు ఉన్నారు. అతని కుమార్తె పట్టణంలోని ఓ కార్పొరేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ఇంప్రూవ్మెంట్ కోసం సదరు విద్యార్థినికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటర్ పడింది. గణితం పరీక్ష రోజున కుమార్తె పరీక్ష రాసిన గదిలోనే తండ్రి విధులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం రక్త సంబంధీకులు ఎవరైనా పరీక్ష…
పదిరోజుల క్రితం ఇంటర్‌బోర్డు అధికారుల ఆదేశాల మేరకు మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విచారణ చేపట్టినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి దస్రూనాయక్ తెలిపారు. కుమార్తె గణితం పరీక్ష రాసిన రోజున తెలుగు అధ్యాపకుడైన తండ్రి విధులు నిర్వర్తించినట్లు గుర్తించామన్నారు. దీనిపై నిజం ప్రిన్సిపల్‌కు తెలియజేయకుండా వ్యవహరించిన సదరు అధ్యాపకుడిపై నివేదిక ఉన్నతాధికారులకు పంపామన్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.