We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
MLA Kov Laxmi visited a poor Adivasi Kolam family from Adilabad district and provided them with Rs 1 lakh in financial assistance and clothes, according to the BRS party. The assistance was provided at the instructions of BRS Working President KTR.
ఆదిలాబాద్ రిమ్స్ బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ములగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన నిరుపేద కుటుంబాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధిత కొడప దుర్గా మారుతి కుటుంబానికి పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కోవ లక్ష్మి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన దుర్గా మారుతి కుటుంబానికి జరిగిన అన్యాయం బాధాకరమని పేర్కొన్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్ నాయకత్వంలో తక్షణ సహాయంగా రూ.లక్ష నగదు, నూతన వస్త్రాలను అందించినట్లు తెలిపారు.
The article explains the traditions and auspicious items to purchase for Dhanteras, which falls on November 6 and 7 according to Hindu mythology. It lists recommended items like gold, silver, and new utensils, while advising against buying iron, sharp objects, and glass.
During Diwali, the Bhagyalakshmi Temple near Charminar in Hyderabad saw an increase in devotee traffic. Consequently, traffic police issued an advisory for November 6–11, warning of potential traffic jams and designating specific parking areas for different routes.
దీపావళి వేడుకల్లో ధన త్రయోదశి పవిత్రమైన రోజున ( నవంబర్ 6,7 తేదీల్లో) ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకోవడం, షాపింగ్ చేయడం లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే నని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజు లక్ష్మీదేవి పుట్టిన రోజు. మరి అలాంటి పవిత్రమైన రోజున ఏ వస్తువలు కొనాలి.. ఏవి కొనకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
బంగారం, వెండి వస్తువులు:ధన త్రయోదశి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బంగారం,వెండి .ఈ రోజున ( నవంబర్ 6,7)బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే... సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు. మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంటే... అర గ్రాము బంగారు నాణేన్ని కొనుగోలు చేయండి.. లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు ఉన్న వెండి నాణేలను కూడా మీరు పూజ కోసం కొనుగోలు చేయవచ్చు. అయితే, బంగారం,వెండి కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
సిటీబ్యూరో: దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 6 నుంచి 11 వరకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు జారీ చేశారు. మదీనా, ముర్గీ చౌక్, అలీబండ-చార్మినార్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అయ్యే అవకాశమున్నందున ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని సూచించారు. కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేయాలని చెప్పారు.
దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి మీర్‌చౌక్ నుంచి వచ్చేవారికి ముఫీద్ ఉల్ అనామ్ స్కూల్ గ్రౌండ్, సర్దార్ మహల్ రోడ్ వద్ద, షా అలీ బండ నుంచి వచ్చే వారికి చార్మినార్ బస్ టర్మినల్, యునాని ఆసుపత్రి వద్ద, నయాపూల్ నుంచి వచ్చేవారికి ఎస్‌వైజే కాంప్లెక్స్‌తో పాటు ఆదివారం ఒక్కరోజు కాలీ కమాన్ గర్ల్స్ స్కూల్ సమీపంలో వాహనాలను పార్క్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పురానాపూల్, బేగంబజార్ వైపు వారికి ఎంజే బ్రిడ్జ్, సిటీ కాలేజ్, హుస్సేనీ ఆలం వైపు వారికి న్యూ ముర్గీ చౌక్ ఖిల్వత్ రోడ్, ఝలుఖానా లాడ్‌బజార్, ఖిల్వత్ గ్రౌండ్ దగ్గరలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు పోలీసులు…
భారత సాంప్రదాయ పండుగల్లో ధంతేరాస్, దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు పండుగలకు కొత్త వస్తువులు కొనటం ఆనవాయితీ అయినప్పటికీ.. ధంతేరాస్ బంగారు కొనుగోలు దారులకు వెరీ స్పెషల్. లక్ష్మీదేవి పుట్టిన రోజు కావడంతో బంగారం కొంటే లక్ష్మీ మన ఇంటికి వచ్చినట్లేనని భావిస్తుంటారు. ప్రతి ఏటా కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథినాడు ధంతేరాస్ జరుపుకుంటారు. ఈ రోజు ధన్వంతరి, కుబేరుని పూజించడం వల్ల ఇంట్లో సంపద, సుఖం వస్తాయని నమ్మకం. కొత్త వస్తువులు కొనడం కూడా శుభప్రదమని భావిస్తారు. చాలా మంది బంగారం, వెండి కొంటారు.
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. హై నుంచి కాస్త పడినప్పటికీ ఏడాది క్రితం ఉన్న రేట్లతో పోల్చితే ఎక్కువే. అందువల్ల చాలా మందికి అవి అందుబాటులో లేవు. అయితే ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి కొనలేమని భావించే వారికోసమే ఈ ఆర్టికల్. బంగారం కొనకపోయినా అలాంటి విలువనిచ్చే.. శుభప్రదమైన ఎనిమిది వస్తువులు కొనవచ్చునని పండితులు చెబుతున్నారు. తక్కువ ధరకు లభించే ఈ వస్తువులు కొంటే బంగారం కొన్నట్లేనని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.