Eenadu ·
Chennai: కోర్టులో శిక్ష ప్రకటిస్తుండగా దోషి పరారీ
చెన్నై: మత్తుపదార్థాల కేసులో న్యాయమూర్తి శిక్ష ప్రకటిస్తుండగా కోర్టు నుంచి దోషి తప్పించుకుని పారిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దిండుక్కల్ జిల్లా సిరుమలైకు చెందిన రాజా అనే వ్యక్తిని పోలీసులు మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ మదురై జిల్లా కోర్టు ప్రాంగణంలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో జరుగుతోంది. గురువారం తుది విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో రాజాకు శిక్ష విధించారు. తీర్పు వివరాలను న్యాయమూర్తి ప్రకటిస్తుండగా కోర్టు గది నుంచి రాజా తప్పించుకున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, న్యాయవాదులు పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇటీవల రాష్ట్రంలోని జైళ్లు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.