We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.
Live
Trending search
ప్రభుత్వం
4 analysed of 5 matched articles · 2 outlets · checked 20 Oct 2026 01:32 IST
Data source: Google Trends — search attention, not opinion
Minister Ponnam Prabhakar announced that the government has granted administrative approvals for irrigation projects in the Husnabad constituency, including the Indiramma flood canal and the Sriram Sagar Project, as a Dussehra gift to farmers.
హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.518 (G.O.Rt.No.518, తేదీ: 19.10.2026) ద్వారా కీలక పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు.
రైతులకు సాగునీరు అందించడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.211.172 కోట్లతో వేరియేషన్ ఎస్టిమేట్-IIకు పరిపాలనా ఆమోదం లభించగా, మరోవైపు ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రత్యేకంగా అనుమతి మంజూరైందని తెలిపారు.
The article reports that a student union leader at Mahatma Gandhi University (MG University) criticized the Telangana government for not allocating any new assistant professor posts to the university under GO 142.
ఫ్రాన్స్‌లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలు వారాంతంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. పారిస్ తో పాటు పలు నగరాల్లో జరిగిన హింసాత్మక ఆందోళనలు అల్లర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం, దోపిడీలకు దారితీయడంతో భద్రతా చర్యలను ఫ్రాన్స్ కట్టుదిట్టం చేస్తోంది. అల్లర్లను అదుపులో తెచ్చేందుకు కర్ఫ్యూ విధించాలని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకార్నో పోలీసులను సోమవారం తెలిపారు. అవసరమైతే ఎమర్జెన్సి విధిస్తామని ప్రకటించారు.
ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయం (Cost of Living Crisis) ,విద్యావ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు ఉధృతమయ్యాయి. గత కొన్ని వారాలుగా కేవలం విద్యార్థులకే పరిమితమైన ఈ ఉద్యమంలోకి ప్రస్తుతం కార్మిక సంఘాలు, 'ఎల్లో వెస్ట్' నిరసన కారులు, సాధారణ ప్రజలు చేరడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేవలం ఒకే రోజున దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల నుంచి8 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలిపారు.
– బీఆర్ఎస్వీ ఎంజీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, అక్టోబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం జీఓ నంబర్ 142 ద్వారా చేపట్టనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం అన్యాయమని బీఆర్ఎస్వీ ఎంజీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వాడపల్లి నవీన్ విమర్శించారు. ఎంజీయూకు అధ్యాపక పోస్టులు కేటాయించకపోవడంతో విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఉన్న అధ్యాపకుల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలతో సమానంగా ఎంజీయూకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
జగిత్యాల, అక్టోబర్ 18 : ఎల్ నినో నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, కాపర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి సూచించారు. జమ్మి చెట్టు విజయానికి చిహ్నమని, బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ‘ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికీ జమ్మి చెట్టు’లో భాగంగా తాటిపర్తి రాంచంద్రారెడ్డి, తాటిపర్తి సీకేరెడ్డి, ఆరావ్రెడ్డి, సర్పంచ్ పోనిశెట్టి మహేశ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్‌తో కలిసి జమ్మి మొక నాటారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేపట్టిన హరితహారం స్ఫూర్తిగా మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన మొకలు నాటే కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. కేసీఆర్ దూరదృష్టితో దుర్భిక్ష పరిస్థితులను ఎదురొనేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. నేటికీ ప్రాణహిత జలాలు 20 వేల క్యూసెకులు వృథాగా పోతున్నాయని, మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి వద్ద 93.5 మీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పారు. రూ.300 కోట్లతో కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టవచ్చని…
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Analysis pending
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల సమస్యల కోసం సుప్రీంకోర్టే స్వయంగా ధర్నాకు దిగుతామని చెప్పడం సంచలనం రేపింది. ‘ఢిల్లీ హైకోర్టు ప్రధాన గేటు ముందు ఫుట్‌పాత్ లేదు. రోడ్డు దాటేందుకు క్రాసింగ్ లేదు. పాదచారులకు భద్రత లేదు. వెంటనే రోడ్డు భద్రతా చర్యలు పూర్తి చేయాలి. నవంబర్ 25లోపు పనులు పూర్తికాకపోతే హైకోర్టు ప్రధాన గేటు ముందు మేమే ధర్నాకు దిగుతాం. పని పూర్తయ్యే వరకు ఇంటికి కూడా వెళ్లం’ అని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ముందు రోడ్డు భద్రతా చర్యలపై ధర్మాసనం అధికారులు తీరును తప్పుబట్టింది.