Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రైతులకు ప్రభుత్వం దసరా కానుక
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Minister Ponnam Prabhakar announced that the government has granted administrative approvals for irrigation projects in the Husnabad constituency, including the Indiramma flood canal and the Sriram Sagar Project, as a Dussehra gift to farmers. The approvals include a variation estimate of Rs. 211.172 crores and new tenders for canal lining and additional structures costing Rs. 40.779 crores. These projects are expected to benefit 22 villages and 24,398 acres of agricultural land.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.518 (G.O.Rt.No.518, తేదీ: 19.10.2026) ద్వారా కీలక పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు.
సాగునీరు అందించడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.211.172 కోట్లతో వేరియేషన్ ఎస్టిమేట్-IIకు పరిపాలనా ఆమోదం లభించగా, మరోవైపు ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రత్యేకంగా అనుమతి మంజూరైందని తెలిపారు.