We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Bollam Mallayya Yadav and Tippana Vijayasimha Reddy stated that the state has deteriorated under three years of Congress rule and that the youth are looking toward BRS to defeat the government in the upcoming assembly elections.
– ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రులకు వివరించాలి – మండలిలో ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డి – గ్రాడ్యూయేట్ ఓట్ల నమోదులో సమీక్షలో బొల్లం మల్లయ్య యాదవ్, తిప్పన విజయసింహారెడ్డి
కోదాడ, అక్టోబర్ 26 : మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో బ్రష్టు పట్టిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు పరిశీలకుడు తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ కోదాడ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదుపై నిర్వహించిన సమీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. విసిగి వేసారిన యువత తమ భవిష్యత్ కోసం…
Tamil Nadu's former Education Minister Anbil Mahesh Poyyamozhi was arrested in a Rs 100 crore scam involving illegal licenses for over 1,000 private schools.
Saudi Arabia reported intercepting Houthi missiles targeting the Mecca and Medina regions, with shrapnel falling in several locations. The Saudi Civil Defense Department announced the damage on Saturday.
రూ. 100 కోట్ల అవినీతి కేసులో తమిళనాడు మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని ప్రైవేట్ పాఠశాలలకు సదరు విద్యా శాఖ మాజీ మంత్రి రూ.100 కోట్ల లంచం తీసుకుని చట్టవిరుద్ధంగా లైసెన్సులు, అనుమతులు జారీ చేశారనే ఆరోపణలపై అన్బిల్ను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ అవినీతి కేసులో 177 ప్రైవేట్ పాఠశాలల పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
వెయ్యికి పైగా ప్రైవేట్ పాఠశాలల ఆమోదాలు, అనుమతులకు సంబంధించిన రూ. 100 కోట్ల కుంభకోణంలో డీఎంకే నేత, తమిళనాడు మాజీ విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి పేరు ప్రధానంగా వినిపించింది. 2021-2026 పదవీకాలంలో పాఠశాలలకు శాశ్వత గుర్తింపు ఇచ్చేందుకు పార్టీ నిధుల ముసుగులో డబ్బు వసూలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
హత్నూర, అక్టోబర్ 26 : గతంలో ధాన్యం కొనుగోల సమయంలో ప్రభుత్వం ముందు చూపు లేక రైతులు అనేక సమస్యలకు గురయ్యారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో పలు గ్రామాలలో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టే సమయంలో తీసుకోవలసిన చర్యలను సరైన సమయంలో తీసుకోకపోవడంతో రైతులు అనేక సమస్యలకు గురయ్యారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకువచ్చి రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడంతో పాటు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయక అనేక సమస్యలు ఎదురైనట్లు తెలిపారు.
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం (అక్టోబర్ 24) ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న దౌత్య ప్రయత్నాల వల్లే జమ్మూ కాశ్మీర్ ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీరీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాలు సరిగ్గా లేవని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. కాశ్మీరీల సమ్మతి తీసుకోకుండా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.